అంతర్జాతీయం

తాత్కాలికంగా ఈ-వీసా రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: చైనాలో పర్యటించాలనుకునే వారికి, అక్కడి నుంచి రావాలని అనుకునే వారికి ఈవీసాను భారత్ తాత్కాలికంగా రద్దు చేసింది. కరోనా వైసర్ విజృంభించి, చైనాను గడగడలాడిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తున్నదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈవీసాలను తాత్కాలికంగా రద్దు చేసిందని భారత రాయబార కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. చైనా పాస్‌పోర్టు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం చైనాలో ఉన్న విదేశీయులందరికీ ఈవీసా రద్దయినట్టు తెలిపింది. భారత అధికారులు ఆదివారం చైనా ఉన్నతాధికారులతో సమావేశమై, పరిస్థితిని ఆరా తీశారు. ఇలావుంటే, వైరస్ సమస్య తగ్గుముఖం పట్టే వరకూ ఈవీసా రద్దు కొనసాగుతుందని సమాచారం.