అంతర్జాతీయం
కరోనా వైరస్‌పై చైనా యుద్ధం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బీజింగ్/ ఉహాన్, ఫిబ్రవరి 2: అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్‌పై చైనా యుద్ధం ప్రకటించింది. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరగడం ఒకవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం మరోవైపు చైనా అధికార యంత్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మహమ్మారిని అణచి వేయాలన్న పట్టుదలతో ఉన్న చైనా ఆదివారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యాధి సోకిన వారిని ఎంపిక చేసిన ప్రత్యేక ప్రాంతాలకు తరలిస్తున్నది. అంతేగాక, ఈ వ్యాధి మొదలైన ఉహాన్‌లో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించింది. ఇప్పటికే కరోనా వైసర్ కారణంగా 305 మంది మృతి చెందగా, 14 వేలకుపైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. భారత్‌సహా మొత్తం 25 దేశాలకు ఈ వైరస్ విస్తరించింది. కాగా, చైనా వెలుపల మొదటి మృతి ఆదివారం నమోదైంది. ఉహాన్ నుంచి గత నెల 21న ఫిలిప్పీన్స్‌కు మహిళతో కలిసి చేరుకున్న ఓ వ్యక్తి కరోనా వైరస్ కారణంగా మృతి చెందాడు. విదేశాల్లో 140 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు చైనా అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, భారత్‌సహా అన్ని దేశాలు చైనాలో నివాసం ఉంటున్న తమతమ ప్రజలను కాపాడేందుకు చర్యలు ప్రారంభించాయి. శని, ఆదివారాల్లో సర్కారు 647 మంది భారతీయులను, ఏడుగురు మాల్దీవ్స్ పౌరులను ఉహాన్ నుంచి విమానంలో స్వదేశానికి తరలించింది. వారందరినీ వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉంచి, పరీక్షలు జరిపిస్తున్నది. ఇప్పటికే 25 దేశాలకు కరోనా వైరస్ వ్యాపించడం చైనా ప్రభుత్వానికి సవాలుగా మారింది.
ఈ దేశాల జాబితాలో అమెరికా ఉండడం కూడా సర్కారుకు కునుకు లేకుండా చేస్తున్నది. అందుకే, దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నది.
*చిత్రం... కరోనా వైరస్ కారణంగా మరణించిన ఓ వ్యక్తిని ఊహన్‌లో అంత్యక్రియల కోసం తరలిస్తున్న చైనా సిబ్బంది.