అంతర్జాతీయం

ప్రతి పది మంది భారతీయుల్లో ఒకరికి క్యాన్సర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి: సగటున ప్రతి పది మంది భారతీయుల్లో ఒకరికి క్యాన్సర్ వ్యాధి సోకుతున్నదని, దీని కారణంగా ప్రతి 15 మందిలో ఒకరు మృతి చెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది. మంగళవారం ప్రపంచ కేన్సన్ దినోత్సవం నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (ఐఏఆర్‌సీ) అధ్యయనం చేసిన, వివరాలను ప్రకటించింది. కేన్సర్‌పై ప్రపంచ వ్యాప్తంగా చైతన్యం తీసుకురావడానికి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేయడం, ఈ వ్యాధిపై విస్తృత పరిశోధన జరిపించడం, నివారణ మార్గాలను కనుక్కోవడం అనే రెండు ప్రధాన అంశాలపై దృష్టి కేంద్రీకరించి ఈ అధ్యయనం కొనసాగింది. భారత్‌లో కేన్సర్ కేసులు విస్తరిస్తున్నాయని, 2018లో 11.16 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని ఈ నివేదిక పేర్కొంది. 7,84,800 మంది కేన్సర్ వ్యాధితో మృతి చెందినట్టు తెలిపింది. 135 కోట్ల మంది జనాభా ఉన్న భారత దేశంలో ఐదేళ్ల కాలంలో 22.60 లక్షల మందికి కేన్సర్ వ్యాధి సోకినట్టు తెలిపింది. రోమ్ము కేన్సర్ (1,62,500 కేసులు), నోటి కేన్సర్ (1,20,000 కేసులు), గర్భాశయ కేన్సర్ (97,000 కేసులు), ఊపిరితిత్తుల కేన్సర్ (68,000 కేసులు), కడుపు కేన్సర్ (57,000 కేసులు), పెద్దపేగు కేన్సర్ (57,000 కేసులు) ఎక్కువగా ఉంటున్నాయని వివరించింది. కొత్త కేన్సర్ కేసుల్లో ఇవి 49 శాతమని ఈ నివేదిక తెలిపింది. పురుషులు, మహిళల్లో నమోదైన 5,70,000 కేన్సర్ కేసుల్లో నోటి కేన్సర్ (92,000 కేసులు), ఊపిరితిత్తుల కేన్సర్ (49,000 కేసులు), కడుపు కేన్సర్ (39,000 కేసులు), పెద్దపేగు కేన్సర్ (37,000 కేసులు), అన్నవాహిక కేన్సర్ (34,000 కేసులు) ఉన్నాయని గణాంకాలు చెప్తున్నాయి. ఇది మొత్తం కేసుల్లో 45 శాతం. మహిళలల్లో కొత్తగా 5,87,000 కేన్సర్ కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక పేర్కొంది. వాటిలో రొమ్ము కేన్సర్ (1,62,500 కేసులు), గర్భాశయ కేన్సర్ (97,000 కేసులు), అండాశయ కేన్సర్ (36,000 కేసులు), నోటి కేన్సర్ (28,000 కేసులు), అన్నవాహిక కేన్సర్ (20,000 కేసులు) ఉన్నాయని, ఇవి మొత్తం కేసుల్లో 60 శాతమని ఆ నివేదిక పేర్కొంది. పొగాకుకు సంబంధించిన కేన్సర్ భారతీయుల్లో ఎక్కువగా ఉంటున్నదని వివరించింది. మెడ కేన్సర్, నోటి కేన్సర్ పురుషుల్లో, అదే విధంగా అండాశయ కేన్సర్ మహిళల్లో ఎక్కువగా సోకుతున్నదని తెలిపింది. సామాజికంగా, ఆర్థికంగా కింద స్థానాల్లో ఉన్న వర్గాల్లో కేన్సర్ కేసులు ఎక్కువగా ఉంటున్నట్టు పేర్కొంది. రొమ్ము కేన్సర్, పెద్దపేగు కాన్సర్‌కు స్థూలకాయం, శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా తెలిపింది. గత రెండు దశాబ్దాల్లో భారత్‌లో కేన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య సుమారు 7 శాతం పెరిగినట్టు వివరించింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్ కేసులో వచ్చే 20 సంవత్సరాల్లో 60 శాతం పెరగవచ్చని హెచ్చరించింది. ఇప్పటి నుంచే సరైన చర్యలను చేపట్టడం ద్వారా ప్రమాదాన్ని కొంత వరకైనా అరికట్టవచ్చని హితవు పలికింది. మధ్య, దిగువ తరగతుల వారే ఎక్కువగా కేన్సర్ బారిన పడడాన్ని గుర్తించి, ఆయా వర్గాల ఆర్థిక, సామాజిక పరిస్థితుల మెరుగుకు కృషి జరగాలని సూచించింది. అంతేగాక, కేన్సర్ నిరోధానికి అవసరమైన పరిశీధన విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.