అంతర్జాతీయం

వారిది వ్యక్తిగత ప్రయోజనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 8: కొన్ని దశాబ్దాలపాటు అమెరికా రాజకీయ నాయకులు జాతీయ ప్రయోజనాల కంటే కూడా వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. గతంలో ఈ నాయకులు తీసుకున్న విధ్వంసకర వాణిజ్య ఒప్పందంలో కొన్నింటిని తాను రద్దు చేశానని తెలిపారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో భాగంగా నార్త్ కరోలీనాలో విస్తృత ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలకు సమ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అమెరికా మహోన్నతంగా ముందుకు సాగుతోందని అన్నారు. గత అధ్యక్షులు కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల అమెరికాకు ప్రయోజనం కంటే కూడా నష్టమే ఎక్కువ జరిగిందని అన్నారు. వాటిని లోతుగా పరిశీలించిన తర్వాతే వాటిలో కొన్నింటిని రద్దు చేశానని పేర్కొన్న ఆయన ‘ఇలాంటి విఘాతపు ఒప్పందాలను ఓ పిల్లవాడు కూడా అంగీకరించే పరిస్థితి ఉండదు’ అని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అవతరించబోతోందని తాను ఏళ్ల తరబడి వింటూనే వస్తున్నానని ట్రంప్ ఈ సందర్భంగా అన్నారు. అయితే, మళ్లీ తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికాను అనితర సాధ్యమైన రీతిలో ముందుకు తీసుకువెళ్తానని చెబుతూనే ఉన్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా చాలా ముందు ఉందని, ఓ రాకెట్ నౌకలాగ దూసుకుపోతోందని తెలిపారు. దేశంలో అనేకమంది రైతులకు, వివిధ వర్గాలకు ఎంతగానో ప్రయోజనం కలిగించామని అన్నారు. ఇప్పటి దాకా వచ్చిన అమెరికా అధ్యక్షులు ఇతర దేశాల అభివృద్ధిపైనే దృష్టి పెట్టారని, ఇప్పుడు తాను అమెరికాను మహోన్నతంగా తీర్చిదిద్దడానికే కృషి చేస్తున్నానని అన్నారు. ఇప్పటికే అమెరికా అభివృద్ధి ఇతర దేశాలు ఈర్ష్యపడేంతగా ఉందని అన్నారు. చైనాతో కూడా ఒప్పందం కుదర్చుకుంటున్నామని తెలిపారు. కరోనా వైరస్ నిర్మూలనలో చైనా ప్రశంసనీయమైన కృషి చేస్తోందని, ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్‌తో తాను మాట్లాడానని తెలిపారు. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ఇరు దేశాలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయని అన్నారు. ఇప్పటికే ఈ వైరస్‌ను అరికట్టడంలో చైనా కొంత విజయం సాధించిందని, అవసరమైన మేర తాము కూడా సాయపడుతున్నామని ట్రంప్ తెలిపారు.

*చిత్రం... అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్