అంతర్జాతీయం

అమెరికాకే అధిక ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 8: రానున్న ఐదేళ్ల కాలంలో భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న నరేంద్ర మోదీ సర్కారు లక్ష్య సాధనలో వాణిజ్య, వ్యాపారపరంగా అమెరికాకు ప్రాధాన్యతాపూర్వక స్థానం ఉంటుందని భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూ స్పష్టం చేశారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం ఫోరం తన గౌరవార్థం ఇచ్చిన ఓ విందు కార్యక్రమంలో అమెరికా వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సహకార సంబంధాలకు అవధులే లేవని స్పష్టం చేశారు. 2024కల్లా భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అలాగే 2030కల్లా పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న బృహత్తర లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ లక్ష్యాలను సాధించుకోవడంలో వాణిజ్య, వ్యాపారపరంగా అమెరికాదే కీలక భాగస్వామ్యమని కూడా భారత ప్రధాని వెల్లడించారని సంధూ అన్నారు. రెండు దేశాల మధ్య మైత్రీబంధం కొత్త పుంతలు తొక్కుతోందని, కొత్త శక్తినీ సంతరించుకుంటోందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని మోదీకున్న సుహృద్భావ మైత్రీ బంధం ఇందుకు ఎంతగానో దోహదం చేస్తుందని సంధూ స్పష్టం చేశారు. గత ఏడాది వీరిద్దరి మధ్య నాలుగు సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. అలాగే రెండు దేశాల మైత్రీ బంధానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, మహిళలు కూడా ఎప్పటికప్పుడు కొత్త శక్తిని అందిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం భారత్‌లో రెండువేలకు పైగా అమెరికా కంపెనీలు ఉన్నాయని అలాగే భారత్‌కు చెందిన 200 కంపెనీలు అమెరికాలో 18 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయని భారత రాయబారి గుర్తు చేశారు. 2018 నాటికే ఇరు దేశాల మధ్య పరస్పర పెట్టుబడులు 60 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని అన్నారు. ఇక ద్వైపాక్షిక వాణిజ్యం ప్రతి యేటా 10 శాతం పెరుగుతూ వస్తోందని, 2019లో 160 బిలియన్ డాలర్లకు చేరుకుందని వెల్లడించారు. ఇవన్నీ కూడా ఈ రెండు దేశాల మధ్య అన్నిరకాలుగాను విస్తరిస్తున్న సత్సంబంధాలకు అద్దం పట్టేవేనని అన్నారు. అయినప్పటికీ కూడా పరస్పర సహకారాన్ని విస్తరించుకోవడానికి ఇరు దేశాలకూ ఎంతో అవకాశం ఉందని, అమెరికా పెట్టుబడులు నైపుణ్యానికి భారత మార్కెట్లు, మేథస్సు తోడైతే ఆకాశమే హద్దుగా పురోగమించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
*చిత్రం... భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూ