అంతర్జాతీయం
మరో 86 మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఫిబ్రవరి 8: చైనాలో కొత్త కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య వేగంగా 722కు పెరిగింది. తాజాగా ఒక్క రోజే 86మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది వైరస్ తీవ్రంగా ప్రబలిన హ్యుబేయి ప్రావిన్స్‌లో చనిపోయారు. ఇదిలా ఉండగా, కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన వారి సంఖ్య 34,546కు పెరిగినట్టు చైనా ఆరోగ్య శాఖ అధికారులు శనివారం తెలిపారు. మెయిన్‌ల్యాండ్ చైనాలో తాజాగా 86 మంది మృతి చెందినట్టు సమాచారం అందిందని, 31 ప్రొవిన్షియల్ స్థాయి రీజియన్లలో తాజాగా 3,399 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. తాజా మృతుల్లో 81 మంది హ్యుబేయి ప్రావిన్స్, దాని రాజధాని వూహాన్‌లోనే మృతి చెందారని ఎన్‌హెచ్‌సీ పేర్కొంది. కరోనా వైరస్‌కు హ్యుబేయి ప్రావిన్స్, దాని రాజధాని వూహాన్ కేంద్ర బిందువుగా ఉన్నాయి. హెయిలోంగ్‌జియాంగ్‌లో ఇద్దరు, చైనా రాజధాని బీజింగ్, హెనాన్, గాన్సులలో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారని ఎన్‌హెచ్‌సీ వివరించింది. శుక్రవారం నాటికి హాంకాంగ్‌లో కరోనా వైరస్ కారణంగా ఒకరు మృతి చెందగా, 26 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. మకావోలో పది మందికి, తైవాన్‌లో 16 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని ఎన్‌హెచ్‌సీ వెల్లడించింది. మొత్తం 4,214 కొత్త అనుమానిత కేసులను గుర్తించినట్టు, 1,280 రోగుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నట్టు, 510 మంది రోగులను పూర్తిగా కోలుకున్న తరువాత ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేసినట్టు ఎన్‌హెచ్‌సీ తెలిపింది. 6,101 మంది రోగుల పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉందని, 27,657 మందికి వైరస్ సోకినట్టు అనుమానించడం జరిగిందని వివరించింది.
ఇప్పటి వరకు మొత్తం 2,050 మంది రోగులు కోలుకున్న తరువాత ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపింది. కరోనా వైరస్ సోకడానికి అవకాశమున్న (క్లోజ్ కాంటాక్ట్స్) 3.45 లక్షల మందిని గుర్తించడం జరిగిందని, వీరిలో 26,702 మందిని వైద్య పర్యవేక్షణ అనంతరం శుక్రవారం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేయడం జరిగిందని కమిషన్ తెలిపింది. 1.89 లక్షల మంది ఇతరులు ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని పేర్కొంది. ఇదిలా ఉండగా, విదేశాలలో కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 220కి పెరిగింది. వీరిలో జపాన్‌లో 86 మంది, సింగపూర్‌లో 33 మంది మృతి చెందారు. కేరళలో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. చైనాలోని వూహాన్ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లిన 647 మంది భారతీయులను ఢిల్లీ శివార్లలోని మానెసార్‌లో విడిగా ఉంచి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.