అంతర్జాతీయం

17మంది హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్: థాయిలాండ్‌లో ఒక సైనికుడు 17మందిని కాల్చి చంపాడు. పైగా ఈ విషయాన్ని అతడు సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడని థాయిలాండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ శనివారం తెలిపింది. ఒక టౌన్ సెంటర్ మాల్‌పై కేంద్రీకరించి ఆ సైనికుడు దాడికి పాల్పడ్డాడు. థాయిలాండ్‌లోని ఈశాన్య నగరమయిన నాఖోన్ రాట్‌చసిమలో ఒక ఆర్మీ బ్యారక్స్ వద్ద మధ్యాహ్నం తరువాత ఈ దాడి మొదలయిందని పోలీసులు ఒక వార్తాసంస్థకు తెలిపారు. సార్జెంట్-మేజర్ జాక్రపంత్ తొమ్మ తొలుత జరిపిన ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఒక సైనికుడు కూడా ఉన్నాడు. ‘అతను ఒక ఆర్మీ వాహనాన్ని దొంగిలించి, దాన్ని నడుపుకుంటూ టౌన్ సెంటర్‌కు వెళ్లాడు’ అని పోలీస్ లెఫ్టినెంట్ కల్నల్ మోంగ్‌కోల్ కుప్తసిరి చెప్పారు. జాక్రపంత్ పట్టణ కేంద్రంలో కాల్పులు జరపడానికి ముందు ఆర్మీ ఆయుధ శాల నుంచి ఆయుధాలను దొంగిలించాడని స్థానిక మీడియా తెలిపింది. సాయుధ సైనికుడు 16మందిని బందీగా తీసుకున్నాడన్న స్థానిక మీడియా వార్తలను అధికారులు తొలుత ధ్రువీకరించలేకపోయారు. అయితే, ఈ కాల్పుల్లో 17 మంది మృతి చెందారని, మరో 14 మంది గాయపడ్డారని బ్యాంకాక్‌లోని ఏరావన్ సెంటర్ నుంచి ఒక అధికార ప్రతినిధి శనివారం పొద్దు పోయిన తరువాత చెప్పారు. ఈ సాయుధ సైనికుడు ఫేస్‌బుక్‌లో తన ఫొటోను పోస్ట్ చేశాడు. అందులో ‘నేను లొంగిపోవాలి’, ‘మరణం నుంచి ఎవరూ తప్పించుకోలేరు’ అని రాశాడు.