అంతర్జాతీయం

చరిత్ర సృష్టించిన ‘పారాసైట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్‌ఏంజిల్స్, ఫిబ్రవరి 10: ఈసారి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ‘పారాసైట్’ చిత్రం చరిత్ర సృష్టించింది. ఎప్పుడు ఏ అంతర్జాతీయ అవార్డులు ప్రకటించినా ఉత్తమ చిత్రం ఏమిటన్న ఆసక్తి సర్వత్రా నెలకొంటుంది. అయితే, ఇప్పటివరకు ఇందుకు సంబంధించిన అంచనాలను తలకిందులు చేస్తూ ‘పారాసైట్’ చిత్రం ఉత్తమ ఆస్కార్‌ను కైవసం చేసుకొంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆస్కార్ చరిత్రలోనే ఓ ఆంగ్లేతర విదేశీ చిత్రానికి ఉత్తమ ఆస్కార్ లభించడం.. దీంతో పాటు మరో మూడు విభాగాల్లోనూ ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
దక్షిణ కొరియా వర్గ విభేదాలపై పదునైన సెటైర్‌గా ‘పారాసైట్’ విమర్శకుల ప్రశంసలు అందుకొంది. ఈ చిత్ర దర్శకుడు బాంగ్‌జూన్‌హో ఉత్తమ దర్శకుడి అవార్డు పొందారు. ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డును కూడా ఈ చిత్రం కైవసం చేసుకొంది. దక్షిణ కొరియాకు చెందిన ఓ చిత్రానికి ఆస్కార్ లభించడం ఇదే మొదటిసారి. 92 సంవత్సరాల ఆస్కార్ చరిత్రలో ఏ అవార్డు వచ్చినా అది ఇంగ్లీష్ సినిమాకే అన్నట్లుగా ఉండేది.
ప్రపంచ సినిమా ప్రియుల పండుగ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అత్యంత అట్టహాసంగా ఆనందోత్సాహాల మధ్య జరిగింది. అంతర్జాతీయ సినిమా రంగంలో లబ్ధప్రతిష్టులైన అతిరథ మహారథులెందరో ఈ ఉత్సవానికి హాజరై దానికి మరింత వనె్న తెచ్చారు. ఆస్కార్ అంటే కేవలం ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవమే కాదు.. అంతర్జాతీయంగా వెల్లివిరుస్తున్న సరికొత్త ఫ్యాషన్‌కు చిరునామా కూడా. కాగా, ఈసారి ఆస్కార్ అవార్డుల్లో భాగంగా ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్ ఉత్తమ సహాయ నటుడి పురస్కారం అందుకొన్నారు. ‘వన్స్‌అపాన్‌ఏటైం’ చిత్రంలో కనబరిచిన నిరుపమాన నటనకు గాను బ్రాడ్‌పిట్ ఈ పురస్కారాన్ని అందుకొన్నాడు. ‘టాయ్ స్టోరీ’కి ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అవార్డు లభించింది. ఇక నటీనటుల విషయానికొస్తే.. ‘జూడీ’ చిత్రానికి గాను రెనీ జెల్‌వెగర్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఆస్కార్ అవార్డులకు ముందే విమర్శకుల ప్రశంసలు అందుకొన్న ‘జోకర్’ చిత్రానికి గాను వాకిన్‌ఫినిక్స్ ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్‌గా ‘పారాసైట్’ ఎంపిక కావడం ఓ చరిత్రే.. ఇంతవరకు ఈ రకమైన విజయాన్ని ఏ అంతర్జాతీయ చిత్రమూ కైవసం చేసుకోలేదు. ‘మ్యారేజ్ స్టోరీ’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా లారా డ్రెన్ ఆస్కార్ పొందారు. ‘అమెరికన్ ఫ్యాక్టరీ’ అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఉత్తమ ఆస్కార్ లభించింది. ‘అమెరికన్ ఫ్యాక్టరీ’ చిత్రాన్ని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులకు చెందిన ఓ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఆస్కార్ అవార్డు సాధించినందుకు ఈ చిత్ర దర్శకుడిని ఒబామా అభినందించారు.
2008 ఆర్థిక మాంద్య సమయంలో ఒహాయోకు చెందిన ఆటో కార్మికులు ఉపాధి లేని పరిస్థితుల్లో ఏ విధంగా జీవనం సాధించారన్న ఇతివృత్తంతో ఈ డాక్యుమెంటరీ నిర్మితమైంది. సాధారణంగా ఓ చిత్రాన్ని నిర్మించే ప్రక్రియకు సంబంధించి ఆస్కార్ అవార్డుల్లో భాగంగా వీడియోలను ప్రదర్శిస్తారు. ఈసారి సత్యజిత్‌రే తీసిన 1955నాటి ‘అధేర్ పాంచాలి’, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ‘జయహో’ పాటను 92వ ఆస్కార్ మాంటేజ్‌లలో చేర్చారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రంలోని ‘జయహో’ పాటకు 2009లో ఏఆర్ రెహమాన్ రెండు ఆస్కార్ పురస్కారాలను విషయం తెలిసిందే.
*చిత్రాలు.. ఉత్తమ నటుడు జాక్విన్ ఫినిక్స్ (జోకర్)
*ఉత్తమ దర్శకుడు బోంగ్ జూన్‌హో (ప్యారసైట్)
*అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైనప్యారసైట్ నటీనటులు