అంతర్జాతీయం

భారత్ పర్యటనకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: మొట్టమొదటి సారి భారత్‌లో పర్యటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, పలు అంశాలను చర్చిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆయన అమెరికా అద్యక్షునిగా ఎన్నికైన తర్వాత భారత్‌లో పర్యటించలేదు. ఈ నెల 24, 25 తేదీల్లో పర్యటనకు రావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ లోగడ ఆయన్ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ఇది ఎంతో ప్రత్యేకమైనదని వ్యాఖ్యానించారు. తన పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక అంశాలు చర్చకు వస్తాయన్నారు. ప్రత్యేకించి వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉన్నదని ఆయన తెలిపారు. భారత్‌తో మైత్రీ సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని, వాటిని మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందన్నారు. ప్రధాని మోదీని గౌరవనీయునిగా ట్రంప్ అభివర్ణించారు. ఈ నెలాఖరులో జరిగే సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుందన్నారు. ఇలాఉంటే వైట్ హౌస్ ట్రంప్ పర్యటన తేదీలను ఖరారు చేసింది. 24, 25 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటిస్తారని పేర్కొంది.