అంతర్జాతీయం

కరోనా మృతులు 1,500

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్/ఊహన్: ఇప్పటికే 1,500 మంది ప్రాణాలను బలిగొని అత్యంత భయానక వాతావరణం సృష్టిస్తున్న కరోనా వైరస్‌పై తాము సాగిస్తున్న పోరాటం అత్యంత కీలకమైన దశకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. ఈ వైరస్ మొదలై నెల రోజులు దాటినా దాని తీవ్రత ఇంకా పెరగడంతో అధికారులు అన్నివిధాలుగా నిరోధక చర్యలపై దృష్టి పెట్టారు. ఊహన్ మినహా మిగతా ప్రాంతాల్లో వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టినట్టు చెబుతున్నా ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 1,723కు చేరుకుంది. మరో 66 వేల మందికి ఈ వైరస్ సోకినట్టుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు చైనాలో పర్యటించనున్నారు. ఇతర దేశాల్లో కూడా కరోనా వైరస్ సోకిన కేసులు పెరుగుతున్నట్టుగా కథనాలు రావడంతో దీని వ్యాప్తిని నిరోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నడుం బిగించింది. ఫ్రాన్స్‌లో ఈ వైరస్ కారణంగా తొలి మరణం సంభవించడంతో ఇప్పటికే ఈ కేసులు నమోదైన ఇతర దేశాల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే దాదాపు 24 దేశాల్లో కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా దేశాలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఫ్రాన్స్‌లో మరణించింది కూడా 80 సంవత్సరాల చైనా టూరిస్టుగానే చెబుతున్నారు. ఇప్పటికే చైనాతో రాకపోకలపైన అలాగే ఆ దేశంతో పౌరయాన సర్వీసులపైనా అనేక దేశాలు నిషేధం విధించాయి. ఈ వైరస్‌కు కీలక కేంద్రంగా భావిస్తున్న హుబీ, ఊహన్ ప్రాంతాలకు చైనా ప్రభుత్వం అదనపు వైద్య బృందాలను పంపడంతోపాటు పరిశోధనల నిమిత్తం భారీగానే నిధులను వెచ్చిస్తోంది. ఈ వైరస్ నియంత్రణకు తాము చేపట్టిన చర్యలు అత్యంత కీలకదశకు చేరుకున్నాయని, ఈ వైరస్‌పై తాము చేస్తున్న పోరాటం హుబీ రాష్ట్రంలో ఓ రణక్షేత్రాన్ని తలపింపజేస్తోందని చైనా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 25,633 మంది వైద్య సిబ్బందితో 217 వైద్య బృందాలు హుబీ ప్రాంతంలో పనిచేస్తున్నట్టు తెలిపారు. కాగా, కరోనా వైరస్‌పై చైనాతో కలసి తాము చేపట్టిన పోరాటం ముందుకు సాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానో గెబ్రియేసస్ తెలిపారు. ఇందులో భాగంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఓ అంతర్జాతీయ మిషన్‌కు చెందిన నిపుణులు చైనా వెళ్తున్నారని తెలిపారు. ఇందులో 12 మంది అంతర్జాతీయ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు, అంతేసంఖ్యలో చైనా నిపుణులు కూడా ఉన్నారని తెలిపారు. కరోనా వైరస్‌ను అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేయడంతోపాటు దాని వ్యాప్తి నిరోధన, వైరస్ పూర్తి నిర్మూలనపై ఈ బృందం పరిశోధనలు సాగిస్తోందని తెలిపారు. ముఖ్యంగా వ్యాధిని నయం చేసే ప్రామాణిక మందులను యుద్ధప్రాతిపదికన ప్రజలకు అందుబాటులోకి తేవడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు.