అంతర్జాతీయం

42 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైరో, సెప్టెంబర్ 22: సుమారు 600 మంది అక్రమ వలసదారులతో వెళ్తున్న పడవ ఒకటి ఈజిప్టు తీరానికి దగ్గర్లో సముద్రంలో మునిగిపోవడంతో కనీసం 42 మంది చనిపోగా, మరో 400 మందికి పైగా గల్లంతయ్యారు. కైరోకు దక్షిణంగా 120 కిలోమీటర్ల దూరంలో కఫ్-్రఅల్‌షేక్ తీరానికి దగ్గర్లో ఈ ప్రమాదం జరిగింది. బోటులో ఈజిప్టు, సిరియా ఆఫ్రికా దేశాలకు చెందినవారే ఎక్కువమంది ఉన్నారు. కనీసం 42 మంది చనిపోయారని, మరో 158 మందిని కాపాడినట్లు ఈజిప్టు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరో 400 మంది జాడ ఇప్పటికీ తెలియడం లేదు. గల్లంతయిన వారిని కాపాడడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తామని, ప్రమాదానికి బాధ్యులైన వారిని శిక్షిస్తామని ఈజిప్టు ప్రధానమంత్రి షరీఫ్ ఇస్మాయిల్ చెప్పారు. అక్రమ వలసలే అంతర్జాతీయ ప్రాధాన్యతల్లో మొదటిదిగా ఉండాలని రెండు రోజుల క్రితం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్-్ఫతా ఎల్-సిసి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో చెప్పిన 48 గంటల్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. అంతర్యుద్ధాలతో అతలాకుతలమవుతున్న చాలా దేశాలకు చెందిన ప్రజలు మెరుగైన జీవితాన్ని గడపడానికి ఐరోపా దేశాలకు వెళ్లేందుకు తమ దేశాలనుంచి తప్పించుకోవడానికి చాలామంది అక్రమ మార్గాలను ఎంచుకోవడం ఇటీవలి సంవత్సరాల్లో ఎక్కువైన విషయం తెలిసిందే.

చిత్రం.. ఈజిప్టు తీరంలో గల్లంతయన వారికోసం ముమ్మరంగా గాలిస్తున్న సిబ్బంది