అంతర్జాతీయం

ఇది గొప్ప గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 15: ప్రజాధరణపై ఫేస్‌బుక్ నిర్వహించిన ఓ సర్వేలో తనకు నెం.1 స్థానం దక్కడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రజాధరణ నేతలపై సోషల్ నెట్‌వర్కింగ్ ఫేస్‌బుక్ సైట్ నిర్వహించిన సర్వేలో ట్రంప్‌కు మొదటి స్థానం, భారత నరేంద్ర మోదీకి ద్వితీయ స్థానం కల్పించింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన సతీమణి మెలినీయా ట్రంప్‌ను ప్రధాని మోదీ భారత్‌కు ఆహ్వానించారు. దీంతో ట్రంప్ సతీసమేతంగా ఈ నెల 24న రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు రానున్నారు. తాను భారత్‌కు వెళ్ళడానికి ముందు ఫేస్ బుక్ ఈ సర్వేను వెల్లడించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందంటూ ట్రంప్ శనివారం ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షునికి మొదటి స్థానం కల్పించడం ఇది కొత్తేమి కాదు. ఇటీవల ట్రంప్ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రజాదరణలో తాను నెంబర్-1 అయితే నెంబర్-2 ఎవరో చెప్పగలరా? అని ప్రశ్నిస్తూ నెంబర్-2 మోదీ అని చెప్పడం గమనార్హం. ట్రంప్ భారత్‌కు వచ్చిన సందర్భంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటయ్యే బహిరంగ సభలో మోదీ, ట్రంప్ ఇరువురూ పాల్గొననున్నారు.