అంతర్జాతీయం

సింగపూర్‌లో చైనీయుడిపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, ఫిబ్రవరి 26: చైనా నుంచి వచ్చిన ఓ వ్యక్తిపై సింగపూర్ అధికారులు కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ సోకినప్పటికీ తాను ఆరోగ్యంగా ఉన్నానని తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సింగపూర్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అతనితో పాటు భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి నుంచి కోవిడ్ వైరస్ ఇతర ప్రయాణికులకు, అతను సందర్శించిన ప్రాంతాల్లోని ఎవరికైనా ఈ వ్యాధి సోకిందా? లేదా? అనే విషయాన్ని నిర్థారించుకోవడానికి వీలుగా అనుమానితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉహాన్‌కు చెందిన 38 ఏళ్ళ హూ జున్ ఆయన భార్యతో కలిసి గత నెల 22న సింగపూర్ చేరుకున్నాడు. అప్పటికే అతనికి కరోనా వైరస్ సోకినప్పటికీ తనకు ఎలాంటి వ్యాధి లేదంటూ తప్పుడు సమాచారం అందించాడు. అనంతరం ఆసుపత్రిలో కరోనా వైరస్ సోకినట్లు బయటపడడంతో సింగపూర్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు.