అంతర్జాతీయం

మా స్నేహం విడదీయలేనిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 22: ఉరి ఘటన నేపథ్యంలో ఓ వైపు ఐరాసలో భారత్ పాక్‌పై దుమ్మెత్తి పోయడం, మరోవైపు ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు అండగా నిలుస్తుండడం లాంటి ఘటనలు జరుగుతూ ఉంటే చైనా మాత్రం పాకిస్తాన్ తమకు చిరకాల మిత్ర దేశమని, తమ బంధం విడదీయలేనిదని చెబుతూ ఉండడం గమనార్హం.
ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బుధవారం చైనా ప్రధాని లీ కెక్వియాంగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు సమావేశమైనారు. వ్యూహాత్మక భాగస్వాములైన ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, స్నేహం కొనసాగుతాయని.. తమ బంధాన్ని ఎవరూ విడదీయలేరని లీ ఈ సందర్భంగా అన్నట్లు చైనా అధికార వార్తాసంస్థ ‘జిన్హువా’ తెలిపింది. పాకిస్తాన్‌కు ఆచరణాత్మక సాయం చేయడానికి చైనా సిద్ధంగా ఉందని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవడానికి కృషి చేస్తుందని లీ తెలిపారు. అయితే షరీఫ్‌తో సమావేశంలో లీ కాశ్మీర్ అంశాన్ని కానీ, ఉరీ ఉగ్రవాద దాడి సంఘటనను కానీ ప్రస్తావించక పోవడం గమనార్హం. అంతర్జాతీయ, స్థానిక వ్యవసారాలపై పాకిస్తాన్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి చైనా ఆసక్తితో ఉందని లీ తెలిపారు. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్, గ్వాడార్ రేవు, ఇండస్ట్రియల్ పార్కు తదితర అంశాల్లో రెండు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని కూడా ఆయన తెలిపారు.
వాస్తవాలు ఇలా ఉంటే పాక్ మీడియా మాత్రం లీ, షరీఫ్ సమావేశంపై పాక్‌కు అనుకూలంగా వార్తలు ప్రసారం చేస్తున్నాయి. తాము పాకిస్తాన్‌ను సమర్థిస్తామని, అన్ని వేదికలపైనా పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడుతామని లీ షరీఫ్‌తో అన్నట్లు ‘డాన్’ దినపత్రిక పేర్కొంది. కాశ్మీర్‌పై పాక్ వైఖరికి చైనా అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, పాకిస్తాన్ కూడా ఉగ్రవాదానికి బలయిన దేశమేనని కూడా ఆయన అన్నట్లు ఆ పత్రిక పేర్కొంది.