అంతర్జాతీయం

అదే నిర్లక్ష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి, ఫిబ్రవరి 26: గత ఏడాది అల్ నూర్ మసీదులో ప్రార్థనలకు వచ్చిన ముస్లింలపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఇప్పటికి సుమారు ఏడాది కావస్తున్నప్పటికీ సదరు మసీదు వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు కూడా లేకపోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తున్నది. గత ఏడాది మార్చి 15న బ్రెంటన్ టారెంట్ అనే వ్యక్తి జాత్యహంకారంతో అల్ నూర్ మసీదుపై తుపాకులతో విరుచుకుపడ్డాడు. ఈ సంఘటనలో శుక్రవారం ప్రార్థనలకు వచ్చిన 43 మందితో సహ మొత్తం 51 మంది మృతి చెందారు. అప్పట్లో ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలోనే మసీదులోని ప్రార్థన గదుల్లో సీసీ టీవీలను ఏర్పాటు చేసి, వాటిని క్రైస్ట్‌చర్చి పోలీసు స్టేషన్‌కు అనుసంథానం చేశారు. అయితే ఆ తర్వాత అదే నిర్లిప్తత, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదని స్థానికులు మండిపడుతున్నారు. మసీదు లోపలగానీ, వెలుపలగానీ భద్రతా పరమైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే మరోసారి దాడులు జరిగే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.

*చిత్రం... క్రైస్ట్‌చర్చి మసీదు వద్ద కనిపించని కాపలా