అంతర్జాతీయం

ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 27: భారత్‌తో అమెరికా సంబంధాలు ఇప్పుడు అసాధారణ స్థాయిలో ఉన్నాయని, అద్భుతమయిన భారతదేశంలో తాను ఇటీవల తొలిసారి అధికారికంగా పర్యటించిన సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమయిన పురోగతి చోటు చేసుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్‌తో అమెరికా పెద్ద మొత్తంలో వ్యాపారం చేయబోతోందని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్‌తో తలపడే అవకాశం ఉన్న బెర్నీ సాండర్స్ ఇటీవల ఢిల్లీలో జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో మానవ హక్కుల పరంగా ‘విఫలమయిన నాయకత్వం’ అంటూ ట్రంప్‌పై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 24, 25 తేదీల్లో భారత్‌లో పర్యటించారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియెన్ సహా ట్రంప్ పాలనాయంత్రాంగంలోని ఉన్నత స్థాయి అధికారులు ఆయన వెంట భారత్‌లో పర్యటించారు. భారత పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత ట్రంప్ బుధవారం నాడిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ‘్భరత ప్రధాని మోదీ ఒక గొప్ప పెద్దమనిషి, ఒక గొప్ప నాయకుడు, భారత్ నమ్మశక్యం కాని ఒక అద్భుత దేశం’ అని అన్నారు. ట్రంప్ అహ్మదాబాద్, ఆగ్రా, న్యూఢిల్లీలను సందర్శించారు. అహ్మదాబాద్‌లో ఆయన మోదీతో కలిసి ఒక పెద్ద బహిరంగ సభలో మాట్లాడారు. తరువాత ఆగ్రాను సందర్శించారు. న్యూఢిల్లీలో అధికారిక సమావేశాలలో పాల్గొన్నారు. భారత పర్యటనలో ట్రంప్ తన గౌరవార్థం అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ఆయన మోదీతో కలిసి వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘మాకు చాలా చాలా మంచి ఆతిథ్యం లభించింది. మేము నిజంగా ఆనందించాం. ఇరు దేశాల సంబంధాలలో అద్భుతమయిన పురోగతి చోటు చేసుకుంది.
ఇప్పుడు భారత్‌తో మన సంబంధాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయి’ అని ట్రంప్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌తో తలపడే అవకాశం ఉన్న సాండర్స్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ట్రంప్ భారత పర్యటనలో న్యూఢిల్లీలో జరిగిన హింసకు సంబంధించి చేసిన ప్రకటన ఆయన ‘విఫలమయిన నాయకత్వాన్ని’ వెల్లడించిందని సాండర్స్ ధ్వజమెత్తారు. ట్రంప్ భారత పర్యటన సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన హింస గురించి ప్రస్తావించగా, ‘వ్యక్తిగతమయిన విమర్శలకు సంబంధించినంత వరకు నేను వాటి గురించి విన్నాను. కాని, నేను వాటి గురించి మోదీతో చర్చించలేదు. అది భారత్‌కు సంబంధించిన అంశం’ అని ట్రంప్ బదులిచ్చారు.