అంతర్జాతీయం

తాలిబన్ నేతలను కలుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అఫ్గానిస్తాన్‌లో సరికొత్త శాంతి శకాన్ని ఆవిష్కరిస్తూ తాజాగా తాలిబన్లతో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ‘నేను త్వరలోనే తాలిబన్ నేతలను కలుసుకుంటాను’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాలిబన్ నేతలతో తాను వ్యక్తిగతంగా సమావేశం అవుతానని పేర్కొన్న ఆయన ఒప్పందంలో భాగంగా ఇచ్చిన హామీలను తాలిబన్లు నిలబెట్టుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాద నిరోధక చర్యలు చేపడుతున్న తమ సైనికులను వెనక్కి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ తెలిపారు. 14 నెలల వ్యవధిలో అఫ్గాన్‌లోని తమ దళాలను ఉపసంహరించుకుంటామని దోహాలో కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా హామీ ఇచ్చింది. ఈ ఒప్పందానికి సంబంధించి ఐక్యరాజ్యసమితికి పూర్తి వివరాలు తెలియజేశామని పేర్కొన్న ట్రంప్ ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో 13వేల మంది తమ సైనికులు ఉన్నారని, వారిని 8 వేలకు కుదిస్తామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉగ్రవాదులను నిర్మూలించడంలో అమెరికా చేస్తున్న కృషిని ట్రంప్ ప్రస్తావించారు. సిరియాలోనూ, ఇరాక్‌లోనూ ఐసిస్ ఉగ్రవాదులను అంతం చేశామని, వేల సంఖ్యలోనే వారిని హతమార్చామని ఆయన తెలిపారు. తాలిబన్‌లో కూడా ఉగ్రవాదులు ఉన్నారని, వారిని అంతం చేయాల్సిన బాధ్యత ఇకనుంచి తాలిబన్లదేనని ట్రంప్ వెల్లడించారు.