అంతర్జాతీయం

చైనాను దాటేసిన ప్రాణాంతక వైరస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: చైనాను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ దేశం దాటి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ప్రాణాంతక వైరస్ చైనా వెలుపల విజృంభించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం చేసింది. వైరస్ ఎక్కడ పుట్టిందో అక్కడ ఇన్‌ఫెక్షన్ తగ్గుముఖం పట్టగా అనూహ్యంగా చైనా బయట దేశాలకు పాకింది. అమెరికాలో మంగళవారం కరోనా వైరస్ సోకి ఆరుగురు మృతి చెందడమే దాని తీవ్రతను తెలియజేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాంతక కరోనాకు 3,100 మంది మరణించారు. సుమారు 90 వేల మందిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. చైనా బయట దేశాల్లో మంగళవారం ఎనిమిది రెట్లు కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనకలిగించే అంశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. వ్యాధి బారిన పడకుండా సాధ్యమైనంత వరకూ ఇళ్లకే పరిమితం కావాలని, బయట తిరగొద్దని సంస్థ హెచ్చరించింది. కొత్తగా కేసులు నమోదుకావడంతో డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్-19 వైరస్‌కు భయపడి అనేక దేశాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇటలీలోని అనేక నగరాల్లో అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. సభలు, సమావేశాలను సాధ్యమైనంత వరకూ తగ్గించేశారు. ప్రజలు గుమికూడడం, క్రీడోత్సవాలను వాయిదా వేసుకోవడం అలాగే వైరస్ బాధిత దేశాలను రాకపోకలను నిషేధించడం వంటి చర్యలు తీసుకున్నారు. ఇళ్ల నుంచే పనిచేసుకోవాలని కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ట్వీట్ చేశాయి. దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ దేశాలు కోవిడ్-19తో అతలాకుతలమవుతున్నాయి. చైనాలో వుహన్ నగరంలోని ఓ జంతు మార్కెట్‌లో బయటపడిన కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. వైరస్ ప్రభావంపై జీ-7 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌లు మంగళవారం అత్యవసరంగా సమావేశమై పరిస్థితని సమీక్షించారు. చైనా తరువాత కోవిడ్-19 వైరస్ బారిన పడ్డ దేశం దక్షిణ కొరియా. అక్కడ 851 కొత్త కేసులు బయటపడడం భయాందోళనకు గురిచేస్తోంది. సౌత్ కొరియాలో ఇప్పటికే ఐదువేల మందికి వైరస్ సోకగా 28 మంది చనిపోయారు. ‘ప్రాణాంతక కోవిడ్-19ని అదుపుచేయడానికి యుద్ధప్రాతిపదికపై చర్యలు తీసుకున్నాం’అని దేశాధ్యక్షుడు మూన్ జేయిన్ వెల్లడించారు. ఇక చైనాలో మంగళవారం 125 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరువారాల లెక్కలు తీసుకుంటే మంగళవారమ నమోదైన కేసులు తక్కువని చెప్పవచ్చు. హుబే రాష్ట్రంలో 11 ఇన్‌ఫెక్షన్ కేసులను నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా చూస్తే 2,943 కేసులు నమోదయ్యాయి. మరో 31 మరణాలు సంభవించాయి. కాగా ఉత్తర ఇటలీలోని లాంబోర్డే ప్రాంతంలో రెస్టారెంట్‌లో ఎనిమిది మంది చైనీయులకు వైరస్ సోకినట్టు తాజా సమాచారం. దేశ రాజధాని బీజింగ్, షాంగై, గాంగ్డాంగ్ రాష్ట్రాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. వైరస్ పీడిత ప్రాంతాల నుంచి రాకపోకలను 14 రోజులుగా నిషేధించారు. కోవిడ్-19 రోజురోజుకూ విజృంభించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ అధానమ్ గెబ్రెయేసస్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ సోకకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రసార మాధ్యమాల ద్వారా జనాన్ని అప్రమత్తం చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా వైరస్ బాధిత దేశాల నుంచి రాకపోకలను కొన్నాళ్లు మానుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలోనూ ఆరు కరోనా మరణాలు సంభవించడంతో ఆయనీ హెచ్చరికలు చేశారు. వలసలపై అధికారులు దృష్టిపెట్టారు. కింగ్ కంట్రీలోనే ఐదుగురు వైరస్ బారిన పడి చనిపోయారు. సీట్లేలో సుమారు రెండు మిలియన్ల జనాభా ఉంటోంది. అలాగే ప్రముఖ వాణిజ్య, రవాణా కేంద్రంగా ఉంది. కాగా వైరస్ తీవ్రతనను వైట్‌హౌస్ తక్కువచేసి చూపే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చికిత్సపై ఓ ప్రకటన చేస్తూ‘ ఈ వేసవినాటికి ఔషధం అందుబాటులోకి వస్తుంది’అని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని మందులు అందుబాటులోకి వచ్చాయని గిలీడ్ ఫార్మాస్యుటికల్ కంపెనీ యాంటీ వైరస్ ఔషధాన్ని అభివృద్ధి చేస్తోందని ఆయన చెప్పారు. తమ పౌరులకు యాంటీ వైరస్ మందును వాడుతున్నట్టు ఉపాధ్యక్షుడు తెలిపారు.
ఇలా ఉండగా ప్రాణాంతక వైరస్‌ను అదుపుచేయడంలో పురోగతిని సాధించామని చైనా అధికారులు చెబుతున్నారు. అనేక ప్రాంతాల్లో వైరస్ తగ్గుముఖం పట్టిందని వారు ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో పైచేయి సాధిస్తామన్న ధీమా చైనా అధికారుల్లో వ్యక్తమవుతోంది. 19 రాష్ట్రాల్లో అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ఆదివారం నుంచి పునరుద్ధరించారు. చైనా ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే ఆంక్షలు మాత్రం కొనసాగుతునే ఉంటాయని వెల్లడించింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లు వారం రోజుల తరువాత పుంజుకోడం ఆశాజనంగా వారు చెబుతున్నారు. మరోపక్క ఐరాస వైద్య నిపుణుల బృందం సోమవారం ఇరాన్ చేరుకుంది. చైనా తరువాత కోవిడ్-19తో బాధపడుతున్న దేశం ఇరాన్. సుమారు 1500 మందికి వైరస్ సోకగా 66 మంది మరణించారు. ఇటలీలోని ప్రముఖ పర్యాట కేంద్రం మిలాన్‌కు సందర్శకులను అనుమతిస్తున్నారు. అయితే ఎక్కువ మందిని అనుమతించకుండా పరిమితంగానే మిలన్‌లోకి ప్రవేశాలు కల్పిస్తున్నారు.
‘ఆమె’ మనకు స్ఫూర్తి
8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఖ ఆరోజు మోదీ సోషల్ మీడియా అకౌంట్లు వారికే

న్యూఢిల్లీ, మార్చి 3: ఈ ఆదివారం సోషల్ మీడియా నుంచి విశ్రాంతి తీసుకోబోతున్నానంటూ ప్రకటన చేసిన ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం మరో ట్వీట్ చేశారు. ‘ఈ ఆదివారం 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆరోజు నా సోషల్ మీడియా ఖాతాలన్నీ మహిళలకే అంకితం. వారే నిర్వహించుకుంటారు’అని ప్రధాని ప్రకటించారు. తన ఖాతాలను వేదికగా చేసుకుని మహిళలు తమ అనుభవాలను పంచుకుంటారని మోదీ ట్వీట్టర్‌లో స్పష్టం చేశారు. అయితే మోదీ ట్విట్టరు, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాంలు ఎంపిక చేసిన మహిళలు నిర్వహిస్తారు. దీని కోసం ‘షీ ఇన్‌స్పైర్ యూ’ పేరుతో క్యాంపయిన్‌కు శ్రీకారం చుట్టారు. మార్చి 8న తన సోషల్ మీడియా ఖాతాలన్నీ ‘ఆమె’ నిర్వహిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా ప్రకటించారు. మహిళలే జాతికి స్ఫూర్తి అని ఆయన వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు. ‘మీరుగాని మీ చుట్టుపక్కలగాని స్ఫూర్తిదాయకమైన మహిళలుంటే షీ ఇన్‌స్పైర్ యూలో భాగస్వాములు కండి. వీడియోలు, ఫొటోలు పోస్టు చేయండి’అని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రధాని ట్వీట్ చేసిన గంటకే 26వేల మంది రీ-ట్వీట్ చేయడం గమనార్హం. ప్రపంచ అధినేతల్లో సోషల్ మీడియా వినియోగించేవారిలో భారత ప్రధాని మోదీ ముందుంటారు. ఆయన ట్విట్టర్‌కు ఏకంగా 53.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
ఫేస్‌బుక్‌లో 44 మిలియన్ల మంది, ఇన్‌స్టాగ్రాంలో 35.2 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. పీఎంవో ట్వీట్టర్‌ను 32 మిలియన్ల మంది ఫాలోఅవుతున్నారు. అత్యధికంగా సోషల్ మీడియా వినియోగిస్తున్న దేశాధినేతల్లో ప్రధాని మోదీ మూడో వ్యక్తి. 2019 సెప్టెంబర్ నాటి లెక్కలివి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన ముందు పనిచేసిన బరాక్ ఒబామా సరసన మోదీ నిలిచారు. అలాగే ట్విట్టర్‌లో 50 మిలియన్ల మంది మార్క్‌ను దాటేసిన తొలి భారతీయుడూ ప్రధానే కావడం గమనార్హం.