అంతర్జాతీయం

నీరవ్ మోదీకి బెయిల్ నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 5: భారతదేశంలో కోట్లాది రూపాయల బకాయిలు ఎగవేసి, లండన్‌లో తలదాచుకున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను యూకే కోర్టు గురువారం కొట్టివేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సుమారు 2 బిలియన్ల రుణాలను ఎగవేసిన 49 ఏళ్ల నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్టు చేసి, వాండ్స్‌వర్త్ జైల్లో ఉంచిన విషయం తెలిసిందే. గత ఏడాది మార్చి నుంచి అతను జైల్లోనే ఉన్నాడు. మే మాసంలో భారత్ అభ్యర్థన మేరకు అతనిని అప్పగించడానికి బ్రిటన్ అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే, భారత్‌లో తనకు ప్రాణహాని ఉందని, కాబట్టి అక్కడకు పంపవద్దని నీరవ్ మోదీ చేసుకున్న అభ్యర్థన విచారణలో ఉన్నందున ఆ ప్రయత్నం ఇంకా పూర్తి కాలేదు. ఇలావుంటే, తనకు బెయిల్ మంజూరు చేయాలని నీరవ్ మోదీ తాజా పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఈ బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మరోవైపు నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడానికి స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.