అంతర్జాతీయం

మీరే తేల్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 22: కాశ్మీర్ అంశం సహా భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న ఏ వివాదంలోనూ జోక్యం చేసుకోవడానికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) నిరాకరించింది. ఉభయ దేశాలు ద్వైపాక్షిక చర్చలద్వారా తమ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించింది. కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పదేపదే చేసిన విజ్ఞప్తులను ఐరాస సెక్రెటరి జనరల్ బాన్ కి మూన్ నిర్ద్వందంగా తోసిపుచ్చారు. భారత్, పాకిస్తాన్ కాశ్మీర్ అంశంసహా తమ మధ్య ఉన్న అన్ని వివాదాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన షరీఫ్‌కు సూచించారు. షరీఫ్ భారత భద్రతా బలగాలు కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ, అందుకు ఆధారాలుగా కొన్ని పత్రాలను బాన్ కి మూన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య జరిగిన సంభాషణలో భారత్‌తో ఉన్న అన్ని వివాదాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బాన్ కి మూన్ షరీఫ్‌కు సూచించారు. బాన్ కి మూన్‌తో షరీఫ్ జరిపిన చర్చల వివరాలను ఆయన అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో వివరించారు.
‘్భరత్, పాకిస్తాన్‌లు కాశ్మీర్ సహా తమ మధ్య ఉన్న వివాదాలన్నింటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సెక్రెటరి జనరల్ నొక్కి చెప్పారు. ఉభయ దేశాలు, మొత్తంమీద ఆ రీజియన్ ప్రయోజనాలకు ఇది ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు’ అని ఆ ప్రకటన వివరించింది. ఐరాస జనరల్ అసెంబ్లీ 71వ సెషన్ జరుగుతున్న సందర్భంగా బుధవారం ఇక్కడ బాన్ కి మూన్‌తో షరీఫ్ విడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షరీఫ్ భారత భద్రతా బలగాలు కాశ్మీరీలపై అత్యాచారాలకు, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ, వాటికి సంబంధించిన కొన్ని చిత్రాలతో కూడిన పత్రాలను మూన్‌కు అందజేశారని ఐరాసలో పాకిస్తాన్ మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

చిత్రం.. న్యూయార్క్‌లో ఐరాస ప్రధాన కార్యదర్శితో సమావేశమైన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్