అంతర్జాతీయం

చైనాలో హోటల్ కూలి.. పది మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మార్చి 8: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆ వైరస్ సోకిందేమోనన్న అనుమానం ఉన్న వారిని విడిగా ఉంచి, పరిశీలిస్తుండటం జరుగుతోంది. ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఇలా కరోనా వైరస్ అనుమానితులను ఇతరులతో కలవకుండా విడిగా ఒక హోటల్‌లో ఉంచగా, ఆ హోటల్ కూలిపోయి పది మంది మృతి చెందారు. అధికార మీడియా ఆదివారం ఈ విషయం వెల్లడించింది. క్వాంజౌ నగరంలో గల ఈ హోటల్ శనివారం కూలిపోయింది. హోటల్ కూలిపోయిన సమయంలో అందులో సుమారు 71 మంది ఉన్నారని అధికార వార్తాసంస్థ జిన్హువా తెలిపింది. నావెల్ కరోనా వైరస్ నిరోధక, నియంత్రణ చర్యలు చేపడుతున్న రోజుల్లో ఇతర ప్రాంతాల్లో కరోనా వైరస్ రోగులతో కలిసి ఉండి, ఈ ప్రావిన్స్‌లోకి వచ్చిన వారిని ఈ హోటల్‌లో విడిగా ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ‘మృతుల సంఖ్య పదికి పెరిగింది. ఇంకా శిథిలాల కింద చిక్కుకొని ఉన్న 23 మందిని కాపాడటానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని అధికార పత్రిక పీపుల్స్ డైలీ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొంది. ఇదిలా ఉండగా, హోటల్ కూలిపోయిన ప్రమాదంలోని బాధితులకు న్యూక్లెయిక్ యాసిడ్ పరీక్షలో ఫలితం నెగెటివ్‌గా వచ్చిందని తెలిపింది. నగరంలోని లిచెంగ్ జిల్లాలో గల జింజియా హోటల్ 2018 నుంచి వినియోగంలోకి వచ్చింది. ఈ హోటల్‌లో 80 గదులు ఉన్నాయి. హోటల్‌ను అలంకరిస్తున్న సమయంలో అది కూలిపోయిందని ప్రాథమిక విచారణలో తేలిందని, ఆ భవనం యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జిన్హువా పేర్కొంది. వెయ్యికి పైగా మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు, వైద్య సిబ్బంది సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ మంత్రిత్వ శాఖ సహాయక కార్యక్రమాలలో నిమగ్నమయిన వారికి సహకరించేందుకు, హోటల్ భవనం కూలిపోవడానికి గల కారణాలపై విచారించేందుకు ఒక వర్క్ టీమ్‌ను క్వాజౌకు పంపించింది.

*చిత్రం... కరోనా వైరస్ సోకిన వారిని ఉపయోగించేందుకు ఉంచిన చైనాలోని ఓ హోటల్ కుప్పకూలిన దృశ్యమిది. చైనా తూర్పు రాష్ట్రంలోని క్వాన్‌ఝైవ్‌లో కూలిన ఈ హోటల్ శిథిలాల కింద 70 మందికి పైగా చిక్కుకుపోయారు.