అంతర్జాతీయం

అమెరికా అధ్యక్షుడికి ‘కరోనా’ సవాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మార్చి 12: మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు బరిలోకి దిగుతున్న డోనాల్డ్ ట్రంప్‌ను కరోనా సమస్య వెంటాడుతోంది. కరోనా నియంత్రణ ఆయనకు సవాలుగా మారింది. చైనాలోని ఊహాన్ నుంచి ప్రపంచంలోని సుమారు వంద దేశాలకు వ్యాప్తి చెందిన కరోనా వైరస్ సమస్య నుంచి అగ్రరాజ్యం అమెరికా కూడా తప్పించుకోలేకపోయింది. అక్కడ కూడా ఈ వైరస్ బాధిత కేసు నమోదు కావడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే, ఈ మహమ్మారిని నియంత్రించగలిగే సాధన సంపత్తి అమెరికా వద్ద అంతగా లేదు. బాధితులకు అందించాల్సిన చికిత్స విధానాల పట్ల కూడా పూర్తి అవగాహన లేదు. దీంతో పరిస్థితులు ఏ విధంగా అదుపులో ఉంచాలనే అంశంపై ట్రంప్ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. కరోనా భయంతో పలు దేశాల నుంచి దిగుమతులను అమెరికా ఇప్పటికే నిలిపివేసింది. ప్రత్యేకించి చైనా నుంచి దిగుమతులు భారీ సంఖ్యలో స్తంభించిపోయాయి. ఫలితంగా అమెరికాలోని పలు పరిశ్రమలు గడ్డు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఈ పరిస్థితిని ట్రంప్ ఏ విధంగా ఎదుర్కొంటారనేది ఉత్కంఠ రేపుతోంది. 1860, 1932, 1968, 2008 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితులే తలెత్తాయి. ఆర్థిక మాంద్యం లేదా విచిత్ర వైరస్‌ల విజృంభణ ఆయా సంవత్సరాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల తీవ్ర ప్రభావం చూపాయి. మరోసారి దేశాధ్యక్షుడిగా ఎన్నిక కావాలనుకొన్నవారి ఆశలు గల్లంతు చేశాయి. ఇప్పుడు ట్రంప్ కూడా అలాంటి చిక్కు సమస్యనే కరోనా వైరస్‌ను కారణంగా ఎదుర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దకపోతే రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన భయాందోళనలు పూర్తిగా తొలగితే తప్ప అమెరికా ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలోకి పడదనేది వాస్తవం. ఎంత త్వరగా ఈ సమస్యకు ట్రంప్ పరిష్కారాన్ని కనుగోగలుగుతారో ఆయన ఎన్నిక అంత సులభం అవుతుంది.
*చిత్రం... డోనాల్డ్ ట్రంప్‌