అంతర్జాతీయం

మరో ఏడాది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్: కరోనా వైరస్ ప్రభావం కనీసం మరో ఏడాది ఉండవచ్చని, అంతకన్నా పెరిగినా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదని సింగపూర్ ప్రధాని లీ హీసెన్ లూంగ్ స్పష్టం చేశారు. సింగపూర్‌లో కరోనా వైరస్ ప్రభావం ఉందనీ.. అయితే, చాలా దేశాలతో పోలిస్తే పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన విలేఖరుల సమావేశంలో చెప్పారు. ‘డిసీజ్ ఔట్‌బ్రేక్ రెస్పాన్స్ సిస్టం కండిషన్’ (డీఓఆర్‌ఎస్‌సీఓఎన్) ప్రస్తుతం ఆరెంజ్ దశ వద్ద ఉందని గుర్తు చేశారు. కొన్ని దేశాల్లో ఇది తీవ్ర స్థాయిలో ఉందని పేర్కొన్నారు. కానీ కరోనా వైరస్ గురించి భయపడుతూ యావత్ ప్రపంచానికి దూరంగా ఉండడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కరోనాపై అప్రమత్తంగా ఉండాల్సిందిగా చేసిన ప్రకటనను లూంగ్ ప్రస్తావిస్తూ.. చైనా, దక్షిణకొరియా, ఇటలీ వంటి దేశాల్లో మాదిరిగా సింగపూర్‌లో ప్రజలను ఇళ్లల్లోనే నిర్బంధించే ప్రమాదం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను నియంత్రీకరించడంతో పాటు ఈ వైరస్ సోకిన వారికి ఉత్తమ వైద్య సేవలు అందించడం ప్రభుత్వానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రజల సహకారంతో వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సింగపూర్‌లో ఇప్పటివరకు 187 కరోనా కేసులు నమోదు కాగా, 96 కేసుల్లో బాధితులు ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు.