అంతర్జాతీయం

పాక్ ఉగ్రవాద దేశమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 22: కరడుగట్టిన ఉగ్రవాది, హిజ్‌బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వనీని ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితి (ఐరాస) జనరల్ అసెంబ్లీలో కీర్తించిన పాకిస్తాన్‌పై భారత్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇంతకుముందెన్నడూ ఉపయోగించనంత ఘాటు పదజాలాన్ని వినియోగిస్తూ తన విమర్శలకు పదునుపెట్టింది. అసలు పాకిస్తానే ఒక ‘ఉగ్రవాద దేశం’ అని తెగేసి చెప్పింది. పాకిస్తాన్ తన విదేశాంగ విధానంలో ఉగ్రవాదాన్ని ఒక పనిముట్టుగా వాడుకుంటూ ‘యుద్ధ నేరాల’కు పాల్పడుతోందని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. ఎలాంటి షరతులు పెట్టకుండా, గంభీరమైన, నిలకడైన ద్వైపాక్షిక చర్చలకు ముందుకు రావాలని పాకిస్తాన్ ఇచ్చిన పిలుపును కూడా భారత్ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. పాకిస్తాన్‌ను ఒక ప్రభుత్వం కాకుండా ఒక ‘యుద్ధ యంత్రం’ నడుపుతున్నట్టు కనపడుతోందని భారత్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అందుకే ఆ దేశం ‘చేతిలో తుపాకి పట్టుకొని’ చర్చలు జరపాలని ఉవ్విళ్లూరుతోందని వ్యాఖ్యానించింది. అయితే చర్చలు, తుపాకులు పరస్పరం కలిసి నడవలేవని స్పష్టం చేసింది. ఐరాస జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఇచ్చిన ఉపన్యాసంలో వాస్తవాలను నిరాకరించడం, భారత్‌పట్ల బెదిరింపులకు, గాండ్రింపులకు దిగటం తప్ప మరోటి లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎంజె.అక్బర్ విమర్శించారు. ఐరాస వంటి ప్రపంచ వేదికపై షరీఫ్ ఉగ్రవాది వనీని ప్రస్తుతించటం, కీర్తించటం పాకిస్తాన్ తనను తాను దోషిగా నిలబెట్టుకోవడమే అవుతుందని ఆయన అన్నారు. అక్బర్ గురువారం ఇక్కడ భారతీయ విలేఖరులతో మాట్లాడుతూ ఐరాస వేదికపై నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఉగ్రవాదిగా తనకు తాను ప్రకటించుకున్న, ప్రచారం చేసుకున్న వ్యక్తిని ఒక దేశాధినేత కీర్తించడం ‘దిగ్భ్రాంతి’ కలిగించే అంశమని అన్నారు. ‘ఒక ఉగ్రవాదిని కీర్తించడాన్ని మనం విన్నాము. బుర్హాన్ వనీ హిజ్‌బుల్ ముజాహిదీన్ కమాండర్‌గా ప్రకటించుకున్న వ్యక్తి. ఈ సంస్థ అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థగా విస్తృతస్థాయిలో గుర్తింపు పొందింది’ అని అక్బర్ అన్నారు. ఇలాంటి కరడుగట్టిన ఉగ్రవాదిని కీర్తించడం ద్వారా పాకిస్తాన్ ప్రధాని తనను తాను దోషిగా నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. షరీఫ్ సుమారు 20 నిమిషాల తన ప్రసంగంలో దాదాపు సగం సమయాన్ని కాశ్మీర్‌పైనే కేంద్రీకరించారని, ఆయన బుర్హాన్ వనీని కీర్తించారని అక్బర్ పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో చర్చలపై భారత్ సుస్పష్టమైన, స్థిరమైన వైఖరిని కలిగి ఉందని అన్నారు. చర్చలకు భారత్ ఎల్లవేళలా సిద్ధమని, అయితే ఉగ్రవాదులను, ఉగ్రవాదాన్ని తన విధానంగా కలిగి ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం పాల్పడుతున్న బ్లాక్‌మెయిల్ వ్యూహాలకు భారత్ తలవంచే సమస్యే లేదని ఆయన తెగేసి చెప్పారు.
కాశ్మీరీల స్వాతంత్య్రోద్యమానికి చిహ్నంగా నిలిచిన యువ నాయకుడు బుర్హాన్ వనీని జూలై 8న భారత బలగాలు హతమార్చడంతో కాశ్మీర్ లోయలో అశాంతి రగులుకుందని షరీఫ్ ఐరాస జనరల్ అసెంబ్లీలో చేసిన తన ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఐరాసలో భారత శాశ్వత మిషన్ కార్యదర్శి ఈనం గంభీర్ అదే వేదికపై షరీఫ్ దుష్ప్రచారాన్ని, నిందారోపణలను తీవ్రంగా ఖండించారు.

chitram.. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో హాజరయేందుకు వెళ్లిన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎంకె అక్బర్ గురువారం న్యూయార్క్‌లో బ్రెజిల్ ఆర్థిక శాఖ మంత్రి జోసె సెరా, జపాన్ ఆర్థిక మంత్రి ఫుమియో కిషీదా, జర్మనీ ఆర్థిక మంత్రి ఫ్రాంక్ వాల్టర్‌లను కలుసుకున్నప్పటి చిత్రం