అంతర్జాతీయం

భారత్-పాక్ స్నేహవారధి సింధూ జల ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 23: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఇప్పటివరకు రెండు యుద్ధాలు జరిగాయి. రెండు దేశాలు దాయాదుల్లాగా నిత్యం ఏదో ఒక విషయంపై గొడవ పడుతూనే వస్తున్నాయి. రెండు దేశాల మధ్య 50 ఏళ్లుగా కాశ్మీర్ వివాదం రావణ కాష్ఠంలాగా కాలుతూనే ఉంది. అయితే ఒక్క విషయంలో మాత్రం రెండు దేశాల మధ్య ఇప్పటివరకు ఎలాంటి పొరపొచ్చాలు తలెత్తలేదు. అదే సింధూ జలాల ఒప్పందం. 56 ఏళ్ల క్రితం కుదిరిన ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య స్నేహవారధిగా కొనసాగుతోంది. నిజానికి సింధూ జల ఒప్పందం పాకిస్తాన్‌కు జీవనాడి. ఈ ఒప్పందం ప్రకారం, సింధూనది, దాని అయిదు ఉపనదుల నీటిని రెండు దేశాలు పంచుకుంటున్నాయి.
ఈ ఒప్పందం ప్రకారం పంజాబ్‌గుండా ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటిపై భారత్‌కు కంట్రోల్ ఉంటే, జమ్మూ, కాశ్మీర్ గుండా ప్రవహించే సింధూ, జీలం, చీనాబ్ నదులపై పాక్‌కు కంట్రోల్ ఉంటుంది. సింధూ నది జలాల్లో 80 శాతందాకా పాక్ వాడుకుంటూ ఉంది. ఇటీవలి జమ్మూ, కాశ్మీర్‌లోని ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది భారత జవాన్లను పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి సింధూ జలాల ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తూ ఉంది. బిజెపిలోని కొంతమంది సైతం ఈ డిమాండ్ చేస్తున్నారు.
అయితే 1960లో భారత్, పాక్ దేశాల మధ్య కుదిరిన సింధూ జలాల ఒప్పందం రెండు యుద్ధాలను తట్టుకుని నిలబడిందని ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ జాన్ ఎలియస్సన్ ప్రశంసిస్తూ, నీరు యుద్ధాలకు దారి తీయడమే కాదు, శాంతికి సైతం దోహదం చేస్తుందనడానికి ఈ ఒప్పందం ఒక నిదర్శనమన్నారు. ‘శాంతిసాధనంగా జలం’ అనే అంశంపై ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘20వ శతాబ్దం రెండో అర్ధ్భాగంలో ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా జల ఒప్పందాలను చర్చల ద్వారా విజయవంతంగా కుదుర్చుకోగలిగారు.
1960లో భారత్, పాక్‌ల మధ్య కుదిరిన సింధూ జలాల ఒప్పందం రెండు యుద్ధాలను సైతం తట్టుకుని నిలబడ్డమే కాకుండా ఇప్పటికీ అమలులో ఉంది’ అని ఎలియస్సన్ అన్నారు. మిగతా ఒప్పందాల గురించి ప్రస్తావిస్తూ ఆఫ్రికాలో జలవనరుల నిర్వహణలో పరస్పర సహకారానికి సుదీర్ఘ చరిత్ర ఉందని కూడా ఆయన అన్నారు. కాగా, ఇలాంటి ఒప్పందాలు పని చేయాలంటే పరస్పర విశ్వాసం, సహకారం ముక్యమని భారత్ స్పష్టం చేసింది.