అంతర్జాతీయం

విమానం హైజాక్ ఉదంతం సుఖాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లార్నాక (సైప్రస్), మార్చి 29: ఈజిప్టు విమాన హైజాక్ కథ సుఖాంతమైంది. ఈ విమానాన్ని బలవంతంగా దారిమళ్లించి సైప్రస్‌కు తీసుకెళ్లిన హైజాకర్‌ను అధికారులు మంగళవారం ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ విమానం నుంచి ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడిన తర్వాత ఈ అరెస్టు జరిగింది. వ్యక్తిగత కారణాలతోనే అతను ఈ విమానాన్ని హైజాక్ చేసి లార్నాక విమానాశ్రయంలో దింపించాడని, పేలుడు పదార్థాలతో కూడిన బెల్టును ధరించినట్లుగా చెబుతున్న ఈ హైజాకర్‌ను పలు గంటల తీవ్ర ఉత్కంఠ తర్వాత అరెస్టు చేశామని సైప్రస్ ప్రభుత్వ అధికార ప్రతినిధి నికోస్ క్రిస్టోడౌలిడెస్ ‘ట్విట్టర్’లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన మిగిలిన వివరాలు అందలేదు. అంతకుముందు ఈ విమానం నుంచి బయటికి వచ్చిన ఒక వ్యక్తి చైతులు పైకెత్తి రన్‌వే మీదుగా నడుచుకుంటూ అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న ఇద్దరు ఉగ్రవాద నిరోధక దళ అధికారుల వైపు రావడం కనిపించింది. అనంతరం అధికారులు గ్రౌండ్‌లోనే రెండు నిమిషాలు అతడిని సోదాచేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. అంతకుముందే ఈ విమానం నుంచి ప్రయాణికులతో పాటు సిబ్బంది బయటికి రావడం కనిపించింది. వీరిలో ఒకరు కాక్‌పిట్ కిటికీ నుంచి బయటికి వచ్చారు. అనంతరం హైజాకర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సైప్రస్ ప్రభుత్వం ప్రకటించడంతో ఈ విమానం నుంచి ప్రయాణికులు, సిబ్బంది ఎటువంటి హాని లేకుండా సురక్షితంగా బయటపడ్డారని ఈజిప్టు పౌర విమానయాన శాఖ మంత్రి షెరీఫ్ ఫాథీ ప్రభుత్వ టెలివిజన్ ద్వారా స్పష్టం చేశారు.