అంతర్జాతీయం

ఒబామా మనసు దోచిన మన బాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 14: వినూత్నమైన ఆలోచనల ద్వారా ప్రపంచ మానవాళికి మరింత మెరుగ్గా సేవ చేయడానికి తోడ్పడిన అమెరికాలోని ఇద్దరు భారతీయ బాల సైంటిస్టులను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పొగడ్తలతో ముంచెత్తారు. కాలిఫోర్నియాకు చెందిన మాయా వర్మ, మేరీలాండ్‌కు చెందిన అనరుధ్ గణేశన్ వివిధ సైన్స్ పోటీల్లో విజేతలుగా నిలవడం ద్వారా ఈ ఏడాది జరిగే ఆరవ వైట్‌హౌస్ సైన్స్ ఫెయిర్‌కు అర్హత సాధించారు. ప్రత్యేకతను నిరూపించుకోవడానికి జీవితంలో వయసనేది ప్రధానం కాదని మీరంతా మాకు చాటి చూపించారని, దేశం నలుమూలలనుంచి ఈ సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొనడానికి వచ్చిన బాల మేధావులతో ముచ్చటించిన అనంతరం ఒబామా అన్నారు. వారిలో ఒకరు కాలిఫోర్నియాకు మాయావర్మ, చాలా తక్కువ ఖరీదు చేసే మైక్రో కంట్రోలర్, ఇంటర్నెట్‌లో లభించే సాఫ్ట్‌వేర్, ఒక స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించి మాయా రూపొందించిన స్పిరో మీటర్ అనే పరికరం దేశ వ్యాప్తంగా ఎంపికయిన 40 టాప్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది. 16 ఏళ్ల అనరుధ్ గణేశన్‌దీ మరో అద్భుత సాధనే. గణేశన్ చిన్నవాడుగా ఉన్నప్పుడు భారత దేశంలో అతని నాన్నమ్మ, తాతయ్యలు అతనికి వ్యాక్సీన్లు వేయించడానికి పది మైళ్లు నడిచి వెళ్లాల్సి వచ్చేది. ఈలోగా దారిలోనే ఆ వ్యాక్సీన్లు చెడిపోయేవి. ఇది గమనించిన గణేశన్ వ్యాక్సీన్లను మారుమూల ప్రాంతాలకు కూడా సురక్షితంగా తీసుకువెళ్లడానికి వీలుగా చక్రాలపై నడిచే ‘వ్యాక్స్ వ్యాగన్’ అనే పరికరాన్ని కనుగొన్నాడు.

చిత్రం వైట్‌హౌస్ సైన్స్ ఫెయిర్‌లో బాల మేధావులు సృష్టించిన పరికరాలను పరిశీలిస్తున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా