అంతర్జాతీయం

కాశ్మీర్‌కు ప్రతిచర్యే ‘ఉరీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 24: జమ్మూ, కాశ్మీర్‌లోని ఉరీలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌లో పరిస్థితులకు ప్రతి చర్యగానే ఉరీ ఘటన జరిగి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం న్యూయార్క్‌నుంచి స్వదేశానికి తిరిగివెళ్తూ షరీఫ్ శుక్రవారం లండన్‌లో ఆగారు. అక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, భారత్‌పై ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌లో ప్రభుత్వాలు పాల్పడుతున్న దమనకాండకు ప్రతి చర్యగా బాధిత ప్రజలు, మృతుల బంధువులు ఉరీ దాడి జరిపి ఉండవచ్చని ఆయన అన్నారు. అంతేకాకుండా భారత్ పాకిస్తాన్‌పై ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే విమర్శలు చేస్తోందని కూడా ఆయన అన్నారు. ఉరీ దాడి ఘటనపై ఎలాంటి దర్యాప్తు జరిపించకుండానే భారత్ తొందరపాటుగా పాకిస్తాన్‌ను నిందిస్తోందని షరీఫ్ అన్నారు.
కాశ్మీర్‌లో భారత్ పాల్పడుతున్న అకృత్యాల గురించి మొత్తం ప్రపంచానికి తెలుసునని, అక్కడ ఇప్పటివరకు 108 మంది చనిపోగా, 150 మంది కంటిచూపు కోల్పోయారని, వేలాది మంది గాయపడ్డారని ఆయన చెప్పారు.
ఉరీ దాడిపై ఎలాంటి ప్రాథమిక దర్యాప్తు జరిపించకుండానే దాడి జరిగిన వెంటనే తమ దేశంపై ఎలా ఆరోపణలు చేస్తారని పాక్ ప్రధాని ప్రస్తావించారు. పాకిస్తాన్‌ను నిందించే ముందు భారత్ కాశ్మీర్‌లో తన దారుణమైన పాత్ర గురించి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా షరీఫ్ సలహా ఇచ్చారు. అంతేకాదు కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా దక్షిణాసియాలో శాశ్వత శాంతి అసాధ్యమని కూడా ఆయన తేల్చి చెప్పారు.

చిత్రం.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలకు నిరసనగా శనివారం భోపాల్‌లో
ఆయన చిత్రపటాన్ని, ఆ దేశ జెండాలను దగ్ధం చేస్తున్న బిజెపి కార్యకర్తలు