అంతర్జాతీయం

పాక్ ఏకాకి అయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 24: ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్య చేయడానికి పాకిస్తాన్ నెలలుగా చేసిన ప్రయత్నాలకు ఐరాసలో ప్రపంచ దేశాలనుంచి ఎలాంటి ప్రతిస్పందనా లభించలేదని, పెరిగిపోతున్న ఉగ్రవాదంపైనే ప్రపంచ దేశాలన్నీ దృష్టిపెట్టాయని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అన్నారు. భారత దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాదానికే ప్రపంచ దేశాలు ప్రతిధ్వనించాయే తప్ప పాక్ ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించిన అంశంపై కాదని ఆయన అన్నారు. ‘ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన చర్చల్లో ఇప్పటివరకు 131 దేశాలు మాట్లాడితే 130 దేశాలు పాకిస్తాన్ లేవనెత్తిన ప్రధాన సమస్యను ప్రస్తావించలేదు. అంటే దాని అర్థమేమిటి?’ అని అక్బరుద్దీన్ ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లడుతూ అన్నారు. ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 71వ సమావేశంలో మాట్లాడిన దేశాల్లో 90 శాతం దేశాలు ఉగ్రవాదమే తమకు ప్రధాన సమస్య అని స్పష్టం చేశాయని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్‌కు అండగా నిలుస్తున్న దేశాల సంఖ్య రానురాను పెరుగుతుండడంపై భారత్ ఆ దేశాలకు ఎంతగానో రుణపడి ఉందని అన్నారు.
ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్ జరిపిన సమావేశాలన్నిటిలోను, భారత దేశం ఉగ్రవాదానికి బలవుతోందనే మాటే ప్రతిధ్వనించిందని, దానికి మద్దతు వినిపించిందని ఆయన అన్నారు. ఉరి ఉగ్రవాద దాడిపై మాట్లాడుతూ శ్రీలంక సహా అన్ని ద్వైపాక్షిక సమావేశాల్లోను ఇదే విషయం ప్రతిధ్వనించడమే కాకుండా భారత్‌కు మద్దతుగా తక్షణ స్పందన కూడా వ్యక్తమయిందని అక్బరుద్దీన్ చెప్పారు. భౌగోళికంగా భారత్‌కు ఎంతో దూరంలో ఉన్న లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల నేతలతో అక్బర్ జరిపిన సమావేశాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొంటూ, ఆ సమావేశంలో పాల్గొన్న నేతలంతా కూడా ఉరి దాడిపై భారత్‌కు తమ సంఘీభావాన్ని తెలియజేయడంతో ఉగ్రవాదం పెరిగిపోవడం పట్ల తమ ఆందోళనను వ్యక్తం చేశారని అన్నారు.
కాగా, ఈ నెల 26వ తేదీన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో చేయబోయే ప్రసంగంకోసం మొత్తం ప్రపంచం ఎదురు చూస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు.
సుష్మాస్వరాజ్ ప్రసంగంలో ఏయే అంశాలుండబోతున్నాయనే విషయాన్ని ఆయన వివరించలేదు కానీ అంతర్జాతీయ శాంతి సుస్థిరతలకు ఏకైక పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపైనే ఆ ప్రసంగం ప్రధానంగా దృష్టిపెట్టవచ్చని అన్నారు. జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగానికి సుష్మాస్వరాజ్ తన ప్రసంగంలో గట్టి సమాధానం చెప్తారని అందరూ భావిస్తున్నారు.

చిత్రం.. న్యూయార్క్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత
ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్. చిత్రంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్