అంతర్జాతీయం

సరుూద్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, సెప్టెంబర్ 25: ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి, ఇతర అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ వివాదాన్ని లేవనెత్తాల్సిందిగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జెయుడి చీఫ్, 26/11 ఉగ్రవాద దాడి సూత్రధారి హఫీజ్ సరుూద్ దాఖలు చేసిన పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ ఈ అంశాన్ని కోర్టు ముందుకు తీసుకురావడం సమర్థనీయం కాదని, ఇది రాజకీయాలకు సంబంధించిన అంశమని పేర్కొంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సయ్యద్ మన్సూర్ అలీ పిటిషన్‌ను కొట్టివేశారు. సరుూద్ తరపు న్యాయవాది ఎకె దోగర్ వాదనలను గత నెలలో విన్న హైకోర్టు వాయిదా వేసి తీర్పును శుక్రవారం వెలువరించింది. కాగా, హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తామని ఎకె దోగర్ చెప్పారు.