అంతర్జాతీయం

మోదీది బాధ్యతారాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 25: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని పాకిస్తాన్ ఆరోపించింది. కాశ్మీర్‌నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి భారత ప్రభుత్వం రూపొందించుకున్న ‘దురుద్దేశపూరితమైన, పకడ్బందీ వ్యూహం’లో భాగమే ఆయన వ్యాఖ్యలని కూడా దుయ్యబట్టింది. కేరళలోని ఒక బహిరంగ సభలో ప్రసంగించిన నరేంద్రమోదీ పాకిస్తాన్‌ను అప్రతిష్ఠపాలు చేయడానికి ప్రయత్నించారని పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఆరోపించింది.
‘రెచ్చగొట్టే ప్రకటనలు, నిరాధారమైన ఆరోపణలు చేయడంద్వారా పాకిస్తాన్‌ను అప్రతిష్ఠపాలు చేయాలన్న దురుద్దేశపూరితమైన పకడ్బందీ వ్యూహాన్ని భారత్ కొనసాగిస్తూ ఉండడం దురదృష్టకరం. అత్యున్నత స్థాయి పదవిలో ఉన్నవారు ఇలాంటి బాధ్యతారహితంగా ప్రవర్తించడం విచారకరం’ అని ఆ ప్రకటన పేర్కొంది. ‘కాశ్మీర్‌లో మహిళలు, చిన్నపిల్లలతోపాటుగా అమాయకులైన, ఎలాంటి రక్షణ లేని కాశ్మీరీలపై భారత భద్రతా దళాలు పాల్పడుతున్న దురాగతాలనుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి భారత్ దిక్కుతోచని పరిస్థితుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడుతోందనే విషయం సుస్పష్టం’ అని పాక్ విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. గత జూలైలో యువనేత బుర్హాన్ వనీని భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చినప్పటినుంచి ఈ దురాగతాలు మరింత తీవ్రమైనాయని ఆ ప్రకటన పేర్కొంది. బుర్హాన్ వనీని పాకిస్తాన్ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్‌గా పేర్కొనక పోవడం గమనార్హం.
శనివారం కోజికోడ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌పై నిప్పులు చెరుగుతూ, ఉరి ఉగ్రవాద దాడిని భారత్ ఎప్పటికీ మరిచిపోదని, పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసి తీరుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఆసియాలోని అన్ని దేశాలు 21వ శతాబ్దాన్ని ఆసియా శతాబ్దం చేయడానికి కృషి చేస్తూ ఉంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉపఖండంలో రక్తపుటేరులు పారిస్తోందని ప్రధాని ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.
గత 75 రోజుల్లో భారత భద్రతా దళాలు కాశ్మీర్‌లో వందమందికి పైగా కాశ్మీరీలను దారుణంగా హతమార్చాయని, వందలాది మందిని అంధులుగా చేసి వేలాది మందిని గాయపరిచాయని పాక్ విదేశాంగ శాఖ తన ప్రకటనలో ఆరోపించింది. భారత్ పాల్పడుతున్న ఈ మానవ హక్కులను ప్రపంచ దేశాలన్నీ పరిగణనలోకి తీసుకున్నాయని, పలు దేశాలు, ఐరాస, ఇస్లామిక్ దేశాల సహకార మండలి (ఓఐసి) తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరిగిందని కూడా పాక్ విదేశాంగ శాఖ ఆరోపించింది. అంతేకాదు ప్రభుత్వ వ్యవస్థల ద్వారా భారత్ ఇప్పటికీ పాకిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని కూడా ఆ ప్రకటన ఆరోపించింది.
భారత ఇంటెలిజన్స్ విభాగానికి చెందిన గూఢచారి కులభూషణ్ జాదవ్ అరెస్టు, అతను ఇచ్చిన వాంగ్మూలం బలూచిస్థాన్ తదితర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ఆ దేశం ఎగదోస్తోందనే విషయాన్ని నిర్ద్వద్వంగా నిరూపిస్తున్నాయని కూడా ఆ ప్రకటన పేర్కొంది.