అంతర్జాతీయం

పే..ద్ద టెలిస్కోప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 25: విశ్వంలో జీవుల అనే్వషణకు చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయత్నాన్ని ప్రారంభించింది. వందలాది వ్యోమగాములు, అంతరిక్ష పరిశోధక విద్యార్థులు, ఆసక్తిపరుల సాక్షిగా అతి పెద్ద టెలిస్కోప్ పరీక్షను ప్రారంభించింది. ఇది అలాంటిలాంటి టెలిస్కోప్ కాదు. 30 ఫుట్‌బాల్ మైదానాల విస్తీర్ణం ఎంత ఉందో.. ఈ టెలిస్కోప్ విస్తీర్ణం అంతది. మొత్తం 4450 పానెళ్లతో 500మీటర్ల వ్యాసంతో తయారు చేసిన రిఫ్లెక్టర్‌తో రోదసిలోని ఇతర గ్రహాల్లో జీవుల అనే్వషణకు శ్రీకారం చుట్టింది. ఆగ్నేయ చైనాలోని గిఝు ప్రావిన్స్‌లోని పింగ్‌టాంగ్ కౌంటీలోని కర్స్ట్ లోయలో ఈ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు. 2011లో ప్రారంభించిన ఈ టెలిస్కోప్ పూర్తి కావటానికిక 180మిలియన్ అమెరికన్ డాలర్ల ఖర్చయింది. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు కోసం 8వేల మంది ప్రజలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. దాదాపు పది కిలోమీటర్ల విస్తీర్ణపు స్థలంలో సుమారు 600 అపార్ట్‌మెంట్లను నిర్మించి నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. ఎందుకంటే ఈ టెలిస్కోప్‌కు కనీసం 5కిలోమీటర్ల చుట్టుపక్కల ప్రాంతంలో రేడియో నిశ్శబ్దం అవసరం.

చిత్రం.. ఇదేదో ఫుట్‌బాల్ మైదానం అనుకుంటే పొరబాటే. చైనా రూపొందించిన అతి పెద్ద టెలిస్కోప్