జాతీయ వార్తలు

షరీఫ్ ఇక ఇంటికేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: పనామా కుంభకోణంలో చిక్కుకున్న నవాజ్ షరీఫ్‌ను పాకిస్తాన్ సైన్యం ప్రధాన మంత్రి పదవి నుంచి తొలగిస్తోందా? ఆయనతోపాటు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీ, పాకిస్తాన్ తేహరీక్-ఇ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కూడా లండన్ చేరుకోవటం చర్చనీయాంశంగా మారింది. వైద్య పరీక్షల కోసం లండన్ వచ్చినట్టు చెబుతున్న నవాజ్ షరీఫ్ ముందు నిర్ణయించినట్టు పారిస్ మీదుగా కాకుండా రష్యా రాజధాని మాస్కో నగరం మీదుగా చేరుకోవడం గమనార్హం. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పనామా కుంభకోణంలో ఉన్న సంగతి తెలిసిందే. పనామా దేశంలో నిధులు దాచుకున్నందుకు ప్రధాన మంత్రి పదవి నుండి తప్పుకోవాలని సైన్యం ఆదేశించినందుకే షరీఫ్ వైద్య పరీక్షల పేరుతో శుక్రవారం రాత్రి లండన్‌కు వెళ్లినట్లు చెబుతున్నారు. ఆయన లండన్ పర్యటన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి ఆషాఖ్‌ధర్ ప్రధాన మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవాజ్ షరీష్‌ను గౌరవమైన పద్ధతిలో ప్రధాన మంత్రి పదవి నుంచి తప్పించిన అనంతరం అధికారాన్ని చేజిక్కించుకునేందుకే సైన్యం ఈవ్యూహం పన్నిందని అంటున్నారు. పాకిస్తాన్ సైనికాధ్యక్షుడు రాహీల్ షరీఫ్ సలహా మేరకే నవాజ్ షరీఫ్ శుక్రవారం రాత్రి లండన్ వెళ్లినట్లు పాకిస్తాన్ పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. 3షరీఫ్ ఇక మీదట పాకిస్తాన్ రారు. ఆయన స్థానంలో సైన్యానికి అనుకూలంగా ఉండే వారిని రెండు, మూడు రోజుల్లో ప్రధాన మంత్రిగా నియమిస్తారు2అని పాకిస్తాన్ టివి చానళ్లు ప్రసారం మొదలెట్టాయి. ఈ కథనాలను షరీఫ్ కొట్టిపారేశారు. 3వైద్య పరీక్షల కోసం లండన్ వచ్చాను. పరీక్షలు పూర్తి కాగానే మళ్లీ పాకిస్తాన్‌కు వెళ్లిపోతాను2అని శుక్రవారం రాత్రి షరీఫ్ లండన్‌లో విలేఖరులతో చెప్పారు.