అంతర్జాతీయం

అంతర్జాతీయ విచారణ జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 26: జమ్ముకాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లోని ఆర్మీ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడిపై నిష్పక్షపాతంగా అంతర్జాతీయ విచారణ జరగాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది. ఈ దాడిలో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు పాల్గొన్నారంటూ భారత్ నిరాధార ఆరోపణలు చేస్తోందని పాక్ ప్రధానికి విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ సోమవారం విమర్శించారు. ‘‘స్వతంత్ర అంతర్జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేసి విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి’’ అని బిబిసి ఉర్దూ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్తాజ్ అజీజ్ అన్నారు. ఇలాంటి దాడులు పాకిస్తాన్‌కు కానీ, కాశ్మీర్‌కు కానీ లాభం చేకూర్చేవి కావని ఆయన అన్నారు. కాశ్మీర్‌లో భారత సైన్యం నిరంతరాయంగా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, దాన్ని చూస్తూ ఊరుకోమని ఆయన వ్యాఖ్యానించారు.