అంతర్జాతీయం

సంగీతానికి ఎల్లలు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 26: సంగీతానికి దేశ, ప్రాంత, భాషాపరమైన ఎల్లలు లేవని లెజండరీ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా అన్నారు. అమెరికాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఇళయరాజా సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ‘‘సంగీతానికి ఒక దేశమంటూ లేదు. దానికి సమయం లేదు. మరేమీ ఉండదు. సంగీతం - కేవలం సంగీతం మాత్రమే.’’ అని అన్నారు. ఉరీ ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్తాన్ కళాకారులను నిషేధించాలంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరికల వివాదం నేపథ్యంలో ఇళయరాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆదివారం న్యూజెర్సీలో భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసిన లైవ్‌షోలో ఆయన పాల్గొన్నారు. సోమవారం వాషింగ్టన్ డిసిలో మొదటి సారి ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చారు. ‘‘వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించిన అత్యద్భుత కళాకారుడు లైవ్‌షోలో పాల్గొనేందుకు రావటం అద్భుతం’’ అని హిల్లరీ క్లింటన్ ప్రచార సిబ్బందిలో ఒకరు, మేరీలాండ్ మాజీ మంత్రి నటరాజన్ అన్నారు. ఆస్కార్ విజేత ఎ ఆర్ రహమాన్‌పై తన ప్రభావం ఎలా పడిందో వివరించాలని అడిగినప్పుడు ఇళయరాజా తిరస్కరించారు. రహమాన్ తన కెరీర్ ప్రారంభంలో ఇళయరాజాతో కలిసి పనిచేశారు. ‘‘మీరు ఆయన్ని అడగండి. మీకు ఆయన గురించి తెలుసు. అయితే నా నుంచి అదే అభిప్రాయాన్ని కోరుకోకండి’’ అని అన్నారు.