అంతర్జాతీయం

అవి సీమాంతర కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 29: నియంత్రణ రేఖ పొడవునా పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న భూభాగంలో భారత సైన్యం నిర్వహించిన మిలిటరి ఆపరేషన్‌ను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. భారత సైన్యం పేర్కొన్నట్టు అది ‘సర్జికల్ స్ట్రైక్’ కానేకాదని, నిష్కారణంగా తమ దేశంపై దాడికి దిగడమే, దురాక్రమణకు ప్రయత్నించడమేనని పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గురువారం ఇక్కడ పేర్కొన్నారు. పాకిస్తాన్ భౌగోళిక సమగ్రతను కాపాడుకునే శక్తి సామర్థ్యాలు తమ దేశ సాయుధ బలగాలకు ఉన్నాయని ఆయన భారత్‌ను హెచ్చరించారు.
ఇరుగుపొరుగు దేశాలతో శాంతియుతమైన సంబంధాలను కలిగి ఉండాలనే పాకిస్తాన్ ఉద్దేశాన్ని బలహీనతగా భావించరాదని ఆయన పేర్కొన్నట్టు రేడియో పాకిస్తాన్ తెలిపింది. భారత్ నియంత్రణ రేఖ పొడవున జరిపిన కాల్పుల్లో తమ దేశానికి చెందిన ఇద్దరు సైనికులు ‘వీరమరణం’ పొందారని కూడా షరీఫ్ పేర్కొన్నారు. ఆ ఇద్దరు సైనికులకు షరీఫ్ నివాళి అర్పించారని పాకిస్తాన్ సైన్యం తెలిపింది. ఇదిలా ఉండగా, ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మిలిటరీ ఆపరేషన్‌కు దిగినట్టు భారత సైన్యం చేసిన వాదనను పాకిస్తాన్ సైన్యం తోసిపుచ్చింది. భారత్.. ‘మీడియా హైప్’ను సృష్టించేందుకు ‘సీమాంతర కాల్పుల’ను ‘సర్జికల్ స్ట్రైక్’గా పేర్కొంటోందని పాకిస్తాన్ సైన్యం ఒక ప్రకటనలో ఖండించింది. అయితే ‘పాకిస్తాన్ సాయుధ బలగాలు కూడా అమలులో ఉన్న నియమాల ప్రకారం తగిన రీతిలో స్పందించాయి’ అని ఆ ప్రకటన పేర్కొంది. పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటు వాటిని లక్ష్యంగా చేసుకొని ‘సర్జికల్ స్రైక్’కు దిగానని భారత సైన్యం పేర్కొనడం అబద్ధమని, వాస్తవానికి భారత సైన్యం నిబంధనలను ఉల్లంఘించి సీమాంతర కాల్పులకు తెగబడిందని నిందించింది. ‘ఒకవేళ పాకిస్తాన్ గడ్డపై సర్జికల్ స్రైక్‌కు దిగితే, పాకిస్తాన్ గట్టిగా ప్రతిఘటిస్తుంది’ అని ఆ ప్రకటన స్పష్టం చేసింది.
కాగా, భారత్ బుధవారం రాత్రి నియంత్రణ రేఖ నిబంధనలను ఉల్లంఘించి, తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరిపిందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. భారత్ కాల్పులకు పాకిస్తాన్ బలగాలు కూడా తగిన రీతిలో బదులిచ్చాయని ఆయన తెలిపారు. సర్జికల్ స్ట్రైక్‌కు దిగినట్లు భారత్ చేసిన వాదనను పాకిస్తాన్ వాయుసేన (పిఎఎఫ్) కూడా తోసిపుచ్చింది. ‘అలాంటి దాడులను తిప్పికొట్టడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంది’ అని పిఎఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది.