అంతర్జాతీయం

అణచివేయాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 29: లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఇటి), జైష్ ఎ మొహమ్మద్ (జెఇఎం) సహా ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రకటించిన ఉగ్రవాద సంస్థలన్నింటినీ పాకిస్తాన్.. చట్ట వ్యతిరేక సంస్థలుగా ప్రకటించాలని, ఆ ఉగ్రవాద సంస్థలపై యుద్ధం చేయాలని అమెరికా కోరుకుంటున్నట్టు ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు సూసన్ రైస్ తెలిపారు. రైస్ ఈ మేరకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు ఈ విషయం చెప్పారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో భారత సైనిక స్థావరంపై దాడికి తెగబడి, 18 మంది భారత జవాన్లను పొట్టన పెట్టుకున్న తరువాత ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటం, తదనంతర పరిణామాలలో సార్క్ దేశాల శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనకూడదని భారత్ నిర్ణయించిన నేపథ్యంలో రైస్ బుధవారం దోవల్‌తో మాట్లాడారు. ‘ఈ నెల 18న ఉరీలోని భారత ఆర్మీ బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్‌పై జరిగిన ఉగ్రవాద దాడిని రైస్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో అమరవీరులయిన జవాన్లకు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎల్‌ఇటి, జెఇఎం సహా ఐరాస ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిన సంస్థలను, వ్యక్తులను పాకిస్తాన్ చట్టవ్యతిరేకమైనవిగా ప్రకటించాలన్న, వాటిపై యుద్ధం చేయాలన్న మా ఆకాంక్షను రాయబారి రైస్ పునరుద్ఘాటించారు’ అని ప్రైస్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గల ఉగ్రవాద దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి అమెరికా చేస్తున్న కృషిని తీవ్రం చేయడానికి అధ్యక్షుడు బరాక్ ఒబామా కట్టుబడి ఉన్నారని ఆమె దృఢంగా చెప్పారు. ‘్భరత్‌తో కలిసి ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలను నెలకొల్పడానికి కృషి చేయాలన్న మా అంకితభావం గురించి, ఐరాస ప్రకటించిన ఉగ్రవాద సంస్థలుసహా ఉగ్రవాదంపై పోరును తీవ్రం చేయాలన్న దృఢనిశ్చయంపై రాయబారి రైస్ చర్చించారు’ అని ప్రైస్ పేర్కొన్నారు.