అంతర్జాతీయం

బ్రహ్మపుత్ర ఉపనది నీటిని నిలిపేసిన చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 1: టిబెట్‌లో అత్యంత భారీ వ్యయంతో చైనా నిర్మిస్తున్న హైడ్రో ప్రాజెక్టుకోసం బ్రహ్మపుత్ర ఉపనది అయిన జియాబుకు నది ప్రవాహాన్ని నిలిపివేసింది. టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిని ‘యార్లుంగ్ జంగ్‌బో’ అని పిలుస్తారు. టిబెట్‌లోని జిగేజ్ ప్రాంతంలో యార్లుంగ్ జంగ్‌బోకు ఉపనది అయిన జియాబుకు నదిపై చైనా 4.95 బిలియన్ యువాన్ల (740 మిలియన్ డాలర్లు) వ్యయంతో లాల్హో ప్రాజెక్టును నిర్మిస్తోందని ప్రాజెక్టు అడ్మినిస్ట్రేషన్ బ్యూరో అధిపతి జంగ్ యున్‌బావోను ఉటంకిస్తూ చైనా అధికార వార్తాసంస్థ జిన్హువా శనివారం తెలిపింది. షింగట్సెగా కూడా పిలవబడె జిగేజ్ ప్రాంతం భారత్‌లోని సిక్కింకు దగ్గరగా ఉంది. జిగేజ్ నుంచి బ్రహ్మపుత్ర నది అరుణాచల్‌ప్రదేశ్‌లోకి ప్రవహిస్తోంది. అయితే బ్రహ్మపుత్ర ఉపనది ప్రవాహాన్ని చైనా అడ్డుకోవడం వల్ల భారత్‌లోని బ్రహ్మపుత్ర నది తీర ప్రాంతాలకు వచ్చే నీటి ప్రవాహంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యంత వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 2014 జూన్‌లో మొదలయిందని, 2019లో పూర్తవుతుందని జిన్హువా వివరించింది. అయితే బ్రహ్మపుత్ర ఉపనది నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల దిగువ దేశాలయిన భారత్, బంగ్లాదేశ్‌లలో బ్రహ్మపుత్ర నది ప్రవాహంపై ఎంతవరకు ప్రభావం చూపుతుందనే అంశం ఇంకా స్పష్టం కాలేదు. టిబెట్‌లోనే అతి పెద్దదయిన, 1.5 బిలియన్ డాలర్ల వ్యయంతో చైనా బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన జామ్ హైడ్రోపవర్ స్టేషన్ గత సంవత్సరం పనిచేయడం మొదలయింది. అయితే భారత్ ఆందోళనను పరిగణనలోకి తీసుకున్నానని, తమ డ్యామ్‌లను నీటిని నిల్వ చేయడానికి డిజైన్ చేయలేదని, నది ప్రవాహం కొనసాగుతుందని చైనా స్పష్టం చేసింది. ఉరీలో ఉగ్రవాద దాడి తరువాత పాకిస్తాన్‌తో సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భారత్ నిర్ణయించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో చైనా బ్రహ్మపుత్ర ఉపనది నీటిని నిలిపివేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.