అంతర్జాతీయం

26/11 ‘బోటు’ పరిశీలనకు ముంబై రానున్న పాక్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, అక్టోబర్ 1: ముంబైపై 26/11 దాడుల కేసుకు సంబంధించి పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఏర్పాటు చేసిన న్యాయ విచారణ బృందం గురువారం ముంబై రానుంది. వందలాది మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు దాడికి వినియోగించిన బోటును ఈ బృందం పరిశీలించనుంది. 2008 ముంబైలో దాడి చేసేందుకు పదిమంది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి బోటుద్వారా నగరంలోకి ప్రవేశించి 166 మంది అమాయకులను హతమార్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇనే్నళ్లుగా విచారణ చేస్తున్న పాకిస్తాన్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఎట్టకేలకు భారత్‌కు అక్టోబర్ 6న పాక్ రేవు పట్టణం కరాచీ నుంచి సముద్రమార్గంలో ముంబై చేరుకుంటారు. ఉగ్రవాద వ్యతిరేక కోర్టు న్యాయమూర్తితోపాటు దర్యాప్తు ఏజెన్సీ అధికారులు, కోర్టు అధికారులు కూడా రానున్నారు. అంతకుముందు దర్యాప్తు బృందం బోటును పరీక్షించేందుకు ట్రయల్ కోర్టు తిరస్కరించింది. అయితే ప్రత్యేక ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మాత్రం తాజాగా దర్యాప్తు బృందాన్ని బోటును పరీక్షించేందుకు అనుమతించింది.