అంతర్జాతీయం

బాధ్యతారహిత ప్రకటనలు చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 1: భారత్‌తో యుద్ధం వస్తే అణ్వస్త్రాలను వాడతామని పాకిస్తాన్ పేర్కొనడాన్ని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై తీవ్ర అభ్యంతరాన్ని ఆ దేశానికి తెలియజేసింది. ‘పాకిస్తాన్‌కు మా అభ్యంతరాన్ని పదే పదే తెలియజేశాం’ అని అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. భారత్‌కు వ్యతిరేకంగా తమ దేశం అణ్వస్త్రాలను ఉపయోగిస్తుందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ గత 15 రోజుల్లో రెండుసార్లు ప్రకటించడం గురించి విలేఖరులు ప్రశ్నించగా, ఇది చాలా తీవ్రమైనది.. ఆలోచించాల్సిన విషయమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి అన్నారు. అయితే ఏ స్థాయిలో తమ అభ్యంతరాన్ని పాక్‌కు తెలియజేశారో మాత్రం ఆయన వెల్లడించలేదు. ‘్భరత్ దుందుడుకు చర్యకు దిగితే తగిన సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని ఖావాజా ఒక పాకిస్తానీ న్యూస్ చానల్‌కిచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు షోకేసులో పెట్టుకోవడానికి తాము అణ్వస్త్రాలను తయారు చేయలేదని, అలాంటి పరిస్థితే ఎదురయితే తాము వాటిని ఉపయోగించి భారత్‌ను తుడిచిపెట్టేస్తామని కూడా ఆయన అన్నారు. కాగా, ఈ ప్రకటనలను ఒబామా ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వ నేతల బాధ్యతా రాహిత్యానికి నిదర్శనంగా భావిస్తోందని ఆ అధికారి చెప్పారు. కాగా, అణ్వస్త్ర దేశాలు పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అమెరికా విదేవాంగ శాఖ మీడియా ప్రతినిధి మార్క్ టోనర్ మార్క్ టోనర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు.
అమెరికా ప్రజాప్రతినిధుల మద్దతు
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై లక్షిత దాడులు జరపడాన్ని అమెరికా ప్రజా ప్రతినిధులు గట్టిగా సమర్థించారు. ‘ఉరి ఉగ్రదాడి చాలా భయానకమైంది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి, దాడి తర్వాత భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే ఆపరేషన్లను నేను గమనిస్తూ ఉన్నాను’ అని అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రటిక్ పార్టీ విప్ స్టెనీ హోయర్ శుక్రవారం ఒక ట్వీట్‌లో అన్నారు. ఉరి దాడిలో తాము ఎదుర్కొన్న ఉగ్రవాదాన్ని తిప్పికొట్టడానికి కృషి చేస్తున్న భారత్‌కే తన మద్దతు ఉంటుందని అమెరికా ప్రతినిధుల సభలో ఇంధన, విద్యుత్ వ్యవహారాల కమిటీ ఉపాధ్యక్షుడు, టెక్సాస్‌కు చెందిన సభ్యుడు పీట్ ఓల్సన్ మరో ట్వీట్‌లో స్పష్టం చేశారు. కాశ్మీర్‌లోని సైనిక స్థావరంపై గత వారం జరిగిన ఉగ్రదాడిలో మృతులకు సంతాపం తెలియజేసిన ఆరిజోనా సెనేటర్ జెఫ్ ఫ్లేక్, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్‌కు తాము అండగా నిలుస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కోరుతూ దాఖలయిన వైట్‌హౌస్ పిటిషన్‌లో సంతకాల సంఖ్య 3లక్షల 90 వేలను దాటిపోయింది.