అంతర్జాతీయం

భారత ప్రసారాలపై పాక్ చానళ్లలో నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 1: భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ కార్యక్రమాల ప్రసారాలను తక్షణం నిలిపివేయాలని పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పిఇఎంఆర్‌ఏ) దేశంలోని చానళ్లను ఆదేశించింది. స్థానిక ప్రైవేట్ టీవీ చానళ్లు భారతీయ టాక్ షోలు, రియాల్టీ కార్యక్రమాలు, సీరియళ్లు లాంటి కార్యక్రమాలను అనుమతి లేకుండా ప్రసారాలు చేస్తున్నాయని తమకు ఫిర్యాదులు వస్తున్నాయని, అంతేకాకుండా భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఇప్పుడు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి దృష్ట్యా కార్యక్రమాల ప్రసారాలపై ఆ ఫిర్యాదుల్లో ఆందోళన వ్యక్తం చేస్తూ, వాటి ప్రసారాలను తక్షణం నిలిపివేయాలని కోరినట్లు రెగ్యులేటరీ ఒక ప్రకటనలో తెలిపింది, భారతీయ చానళ్ల అక్రమ ప్రసారాల ఆపడానికి తాము ఇప్పటికే చర్యలు తీసుకున్నామని ఆ సంస్థ అంటూ, అన్ని డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లు, టీవీ చానళ్లు చట్ట ప్రకారం నడుచుకొని తక్షణం భారతీయ కార్యక్రమాల ప్రసారాలను నిలిపివేయాలని హెచ్చరించింది.
లక్షిత దాడులు అబద్దం
ఇదిలా ఉండగా, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలపై లక్షిత దాడులు జరిపినట్లు భారత్ చేస్తున్న వాదన అంతా అబద్ధమని పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్‌కు తెలియజేసింది. అంతేకాదు, ఉద్రిక్తత పెరిగిపోకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత భారత్‌పైనే ఉందని కూడా వాదించింది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి మలీహా లోదీ ఐరాస ప్రతినిధి బాన్ కి-మూన్‌తో శుక్రవారం సమావేశమై ఈ విషయం చెప్పారు. పాకిస్తాన్ పూర్తి సంయమనం పాటిస్తోందని, అయితే భారత్ గనుక రెచ్చగొట్టే, దుందుడుకు చర్యలకు పాల్పడితే తగిన రీతిలో స్పందిస్తుందని కూడా ఆమె మూన్‌కు తెలియజేశారు. లక్షిత దాడులు జరిపినట్లు భారత్ చెప్పుకొంటున్నదంతా కూడా అబద్ధమని, లక్షిత దాడులు జరిపామని చెప్పుకోవడం ద్వారా భారత్ పాక్‌పై దాడి చేసినట్లు తానే ఒప్పుకుందని మలీహా ఐరాస ప్రధాన కార్యదర్శితో అన్నట్లు ఐరాసలో పాక్ దౌత్య కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. ఐరాస తీర్మానాల ప్రకారం దాడులను, రెచ్చగొట్టే చర్యలను తక్షణం ఆపాలని భారత్‌ను గట్టిగా కోరే బాధ్యత ఐరాస ప్రధాన కార్యదర్శిపై ఉందని కూడా ఆమె అంటూ, అలా చేయని పక్షంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని అన్నారు.
కాగా, కాశ్మీర్ సహా అన్ని అపరిష్కృత సమస్యలను శాంతియుతంగా దౌత్యపరంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్ భారత్, పాక్‌లకు పిలుపునిచ్చారు. ఇటీవలి పరిణామాల దృష్ట్యా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడం పట్ల బాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన ప్రతినిధి విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. అంతేకాదు ఇరు దేశాలు అంగీకరించిన పక్షంలో ఈ విషయంలో తన పలుకుబడిని ఉపయోగించడానికి ఐరాస ప్రధాన కార్యదర్శి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని కూడా ఆ ప్రకటన తెలిపింది. కాగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సైన్యం లక్షిత దాడులు జరపడంపై పాక్ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడంపై ఐరాసలో దానికి ఎలాంటి ఊరటా లభించలేదని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు.
మరణాలను భారత్ దాచిపెడుతోంది: పాక్
ఇదిలా ఉండగా, నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద స్థావరాలపై జరిపిన లక్షిత దాడుల్లో భారత సైన్యంలో కూడా మరణాలు సంభవించిన మాట నిజమని పాక్ సైన్యం అంటూ, అయితే నారత్ తన నష్టాలను దాచి పెడుతోందని ఆరోపించింది. నియంత్రణ రేఖపై భారత్ జరిపిన కాల్పులకు పాక్ సైన్యం దీటయిన సమాధానం ఇచ్చిందని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాగ్‌సర్ ప్రాంతంలో మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టెనెంట్ జనరల్ అసీమ్ సలీమ్ బాజ్వా చెప్పినట్లు పాక్ రేడియో తెలిపింది. ఎలాంటి దాడినైనా తిప్పి కొట్టడానికి పాక్ సైన్యం సంసిద్ధంగా ఉందని ఆయన అంటూ, అయితే యుద్ధం ఎవరికీ మేలు చేయదని కూడా వ్యాఖ్యానించారు.