అంతర్జాతీయం

ఐరాస సెక్రటరీ జనరల్‌గా ఆంటోనియో గట్టర్స్ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, అక్టోబర్ 6: ఐక్యరాజ్య సమితి తొమ్మిదవ సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్ మాజీ ప్రధాన మంత్రి ఆంటోనియో గట్టర్స్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భద్రతా మండలి సభ్య దేశాలు ముక్తకంఠంతో గట్టర్స్ పేరును ఆమోదించాయి. అనంతరం లిస్బన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ పదవిని అత్యంత బాధ్యతాయుతంగా, అంకితభావంతో నిర్వర్తిస్తానని చెప్పారు. బాన్‌కి మూన్ వారసుడిగా ఎలాంటి జాప్యం లేకుండా, ఐక్యంగా, ఏకగ్రీవంగా భద్రతా మండలి తనను ఎంపిక చేయడం తనను కదిలించి వేసిందన్నారు. ఉగ్రవాదం, మానవ హక్కుల ఉల్లంఘన, పేదరికం వంటి సవాళ్లను పరిష్కరించేందుకు బాధ్యత, దక్షతతో కృషి చేస్తానని గట్టర్స్ తెలిపారు.