అంతర్జాతీయం

మా జీవితాలు నరకమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిల్గిత్, అక్టోబర్ 6: ‘‘ఇక్కడ ఉగ్రవాదుల శిబిరాల మధ్యన మా బతుకులు దుర్భరంగా మారాయి. వీటిని ఇక్కడి నుంచి తుడిచిపెట్టేంత వరకు మాకు మనశ్శాంతి లేదు’’ అని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని సామాన్య ప్రజలు ఆక్రోశం వెలిబుచ్చారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలకు వ్యతిరేకంగా గురువారం అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముజఫరాబాద్, కోట్లి, చినారి, మీర్పూర్, గిల్గిత్, దయామెర్, నీలమ్ పట్టణాల ప్రజలు గురువారం వీధుల్లోకి వచ్చి ఉగ్రవాద శిబిరాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. పిఓకేలో ఉగ్రవాద శిబిరాలను సమూలంగా నిర్మూలించేందుకు స్థానిక ప్రభుత్వంతో పాటు పాకిస్తాన్ సర్కార్ తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ‘‘మా భూభాగం నుంచి ఈ ఉగ్రవాదులను, వారికి శిక్షణ ఇస్తున్న శిబిరాలను పూర్తిగా నిర్మూలించాలి. మా ఇళ్లల్లో వారికి ఆశ్రయం ఇవ్వటం వెంటనే నిలిపేయాలి. అప్పుడే మా సమస్యకు పరిష్కారం లభిస్తుంది.’’ అని ఓ నిరసన కారుడు వ్యాఖ్యానించారు. ‘దయామెర్, గిల్గిత్, బాసీన్‌లలో ప్రవేశ నిషిద్ధ ప్రాంతాలకు ముగింపు పలకాల్సిందే. లేకపోతే, పరిస్థితులను మేం మా చేతుల్లోకి తీసుకోవలసి ఉంటుంది.’ అని మరో నాయకుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారత్ లక్షిత దాడులు చేయనే లేదంటూ ప్రపంచాన్ని నమ్మించాలని తెగ ప్రయత్నిస్తున్న పాకిస్తాన్‌కు పిఓకేలో తాజా నిరసనలు మరింత ఇరకాటంలోకి నెట్టాయి. కొద్ది రోజుల క్రితం పి ఓకేలోని కోట్లిలో స్థానికులు పాక్ సైన్యం, ఐఎస్‌ఐల అరాచకాలను నిరసిస్తూ నిరసనలు నిర్వహించారు. పి ఓకేలో మానవ హక్కుల ఉల్లంఘనలపై అమెరికా విదేశాంగ శాఖ కూడా ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. ‘పీఓకెలో మానవ హక్కుల ఉల్లంఘనలపై మాకూ ఆందోళనగా ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇందుకు సంబంధించి మా మానవ హక్కుల నివేదిక తీవ్రంగా ప్రస్తావిస్తోంది. మేమూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, అన్ని రాజకీయ పార్టీలను విభేదాలు మరచి రాజకీయ ప్రక్రియ ద్వారా శాంతి కోసం యత్నించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాం.’’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మార్క్ టోనర్ వ్యాఖ్యానించారు.

చిత్రం.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో గురువారం నాడు వెల్లువెత్తిన నిరసనల దృశ్యం