అంతర్జాతీయం

అమెరికా మారిపోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 8: అమెరికా.. భారత్ విషయంలో తన విధానాన్ని మార్చుకోవడంతో పాకిస్తాన్ రష్యాతో సన్నిహిత సంబంధాలు పెంపొందించుకోవాలని భావిస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన కాశ్మీర్ వ్యవహారాల దౌత్యవేత్త, సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ సయ్యద్ ఈ విషయం చెప్పారు. అమెరికా తన రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. అట్లాంటిక్ కౌన్సిల్ అనే సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘అమెరికా దౌత్య విధానంలో మార్పును మేము గమనించాం’ అని అన్నారు. ‘పాకిస్తాన్- రష్యా సంబంధాలలో ఇది నూతనాధ్యాయం’ అని ఆయన అన్నట్టు ‘డాన్ న్యూస్’ తెలిపింది. తమ రీజియన్‌లోని దేశాలతో కలిసి పనిచేయగలిగిన సంబంధాలను నెలకొల్పుకోవడానికి రష్యా సంసిద్ధంగా ఉందని, ఇప్పటికే ఆ దేశం అఫ్గాన్ తాలిబన్‌తో తెరవెనుక మార్గాల ద్వారా చర్చలు జరుపుతోందని సయ్యద్ వెల్లడించారు. 2006లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి వీసా ఇవ్వడానికి నిరాకరించిన అమెరికా, ఆయన ప్రధానమంత్రి కాగానే తన రాజకీయ ప్రయోజనాలకోసం తన విధానాన్ని మార్చుకుందని సయ్యద్ విమర్శించారు. సింధూ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే.. అది యుద్ధ నేరం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంలో భారత్, పాకిస్తాన్‌లతో పాటు ప్రపంచ బ్యాంకు కూడా భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ఉరీ దాడి గురించి ఆయన ప్రస్తావిస్తూ ఈ దాడిపై భారత్, పాకిస్తాన్‌ల కోసం ఏర్పడిన ఐరాస సైనిక పరిశీలక బృందం విచారణ జరపాలని సయ్యద్ అన్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి
భారత ప్రధాని మోదీ పాకిస్తాన్‌లోని బాలోచిస్తాన్ అంశాన్ని ప్రస్తావించడం ఆపివేయకపోతే పాకిస్తాన్ కూడా భారత్‌లోని ఖలిస్తాన్, నాగాలాండ్, త్రిపుర, అస్సాం, సిక్కిం, మావోయిస్టుల తిరుగుబాటు అంశాలను లేవనెత్తుతుందని సయ్యద్ హెచ్చరించారు.