అంతర్జాతీయం

11 మంది మిలిటెంట్లను మట్టుబెట్టిన బంగ్లా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, అక్టోబర్ 8: బంగ్లాదేశ్ సైన్యం శనివారం ఇస్లామిక్ ఉగ్రవాదుల రహస్య స్థావరాలపై దాడులు చేసి 11 మందిని హతమార్చింది. సైన్యం దాడుల్లో చనిపోయిన మిలిటెంట్లలో కొత్తగా ఏర్పాటయిన జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ ప్రాంతీయ కమాండర్ కూడా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో వీరంతా చనిపోయారు. గాజీపూర్ సిటీలోని అఫర్‌ఖోలా ప్రాంతంలో ఉన్న రెండతస్థుల భవనంపై పోలీసు ఉగ్రవాద నిరోధక విభాగం జరిపిన దాడిలో ఏడుగురు మిలిటెంట్లు హతమైనారని జిల్లా అదనపు పోలీసు చీఫ్ రస్సెల్ షేక్ పిటిఐకి చెప్పారు. చనిపోయిన మిలిటెంట్లలో పునర్వ్యవస్థీకరించిన జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ ఢాకా ప్రాంత కమాండర్ ఆకాశ్ కూడా ఉన్నాడని బంగ్లాదేశ్ హోమ్ మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమాల్ మీడియాకు చెప్పారు. ఇంతకుముందు నారాయణ్ గంజ్‌లో భద్రతా దళాలు జరిపిన దాడిలో తమీమ్ చౌదరి మృతి చెందడంతో ఆకాశ్ కొత్తగా ఏర్పాటయిన ఢాకా విభాగానికి కమాండర్‌గా వ్యవహరిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే మిగతా మిలిటెంట్ల వివరాలు మాత్రం వెంటనే తెలియరాలేదు. భద్రతా అదికారులు లొంగిపోవలసిందిగా మిలిటెంట్లను లౌడ్‌స్పీకర్ ద్వారా హెచ్చరించారని, అయితే వారు ఆ హెచ్చరికను బేఖాతరు చేస్తూ కాల్పులకు తెగబడ్డారని, ఫలితంగా జరిగిన ఎన్‌కౌంటర్లో వారంతా చనిపోయారని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసు ఉగ్రవాద నిరోధక విభాగం చీఫ్ మోనిరుల్ ఇస్లామ్ చెప్పారు. అంతకుముందు గాజీపూర్ శివారు, తంగాలి జిల్లాల్లోని మిలిటెంట్ల రహస్య స్థావరాలపై ఏకకాలంలో జరిపిన దాడుల్లో మరో నలుగురు మిలిటెంట్లు హతమైనారు. రహస్య స్థావరాలనుంచి ఒక ఎకె-47 రైఫిల్, డజన్ల సంఖ్యలో తూటాలు, బాంబు తయారీలో ఉపయోగించే పేలుడు పదార్థాలు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. నయా జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్‌కు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో సన్నిహిత సంబంధాలున్నట్లు చెబుతారు. గత జూలై 1వ తేదీన ఢాకాలోని హోలీ ఆర్టిసన్ రెస్టారెంట్‌పై ఉగ్రవాదులు దాడి చేసి పలువురు విదేశీయులతో పాటుగా 20 మందిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి తామే జరిపినట్లు ఐసిస్ అప్పట్లో ప్రకటించుకుంది. ఆ ఘటన తర్వాత బంగ్లాదేశ్ భద్రతా దళాలు మిలిటెంట్లను ఏరివేయడానికి వారి స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులను కొనసాగిస్తోంది.

చిత్రం.. మిలిటెంట్లను మట్టుబెట్టిన అనంతరం తిరిగి వస్తున్న బంగ్లాదేశ్ సైనికులు