అంతర్జాతీయం

థాయ్ రాజు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాంకాక్, అక్టోబర్ 13: థాయ్‌లాండ్ రాజు భూమిబోల్ అదుల్యదేజ్ (88) గురువారం కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఏడు దశాబ్దాలుగా థాయ్‌లాండ్ రాజుగా పరిపాలించిన భూమిబోల్ మధ్యాహ్నం 3.52 గంటలకు సిరిరాజ్ ఆసుపత్రిలో ప్రశాంతంగా అస్తమించినట్లు రాజభవనం ఒక ప్రకటనలో ప్రకటించింది. యువరాజు మహా వజీరలాంగ్‌కర్న్, యువరాణి మహా చక్రి సిరింధోమ్ మహారాణి సోమ్‌సవలి, రాణి చులాభోర్న్‌లు రాజు మరణ సమయంలో ఆసుపత్రిలో ఆయన చెంతనే ఉన్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 63 ఏళ్ల యువరాజు భూమిబోల్ వారసుడుగా రాజు బాధ్యతలను స్వీకరిస్తారు. రాజు మరణ వార్త విన్నంతనే ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున థాయ్ ప్రజలు చేరుకుని దివంగత నేతకు నివాళులు అర్పించారు. ‘‘ ఇలాంటి రోజు వస్తుందని థాయ్ ప్రజలు కలలో కూడా అనుకోని ఉండరు. ఇది మా దేశానికి అతి పెద్ద నష్టం’’ అని థాయ్‌లాండ్ ప్రధానమంత్రి జనరల్ ప్రయూథ్ చన్ ఓచా పేర్కొన్నారు. థాయ్‌లాండ్ ఏడాది పాటు రాజుకు సాధారణ సంతాప దినాలు పాటిస్తుందని.. సమాజంలోని అన్ని రంగాల ప్రజలు నెల రోజుల పాటు ఎలాంటి వినోద కార్యక్రమాల్లో పాల్గొనరాదని కోరినట్లు ప్రయూథ్ తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 30 రోజుల పాటు థాయ్ పతాకం అవనతం అయి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ అధికారులంతా 30 రోజుల పాటు నల్ల దుస్తులు ధరించి వస్తారన్నారు. భూమిబోల్ చక్రి రాజవంశానికి చెందిన 9వ రాజు ఈయన్ను రామ-11 అని కూడా పిలుస్తారు. దేశంలో సుస్థిరత, ఐక్యత సాధించటానికి ఆయన చాలా కృషి చేశారు. 1946లో రాజ్యాధికారాన్ని చేపట్టిన భూమిబోల్ ప్రపంచంలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజుగా ఆయన రికార్డు సృష్టించారు.