అంతర్జాతీయం

అమెరికా గేయ రచయిత డైలాన్‌కు సాహిత్యంలో నోబెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోమ్, అక్టోబర్ 13: అమెరికాకు చెందిన ప్రముఖ గేయ రచయిత బామ్ డైలాన్ ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ సాహిత్య అవార్డును దక్కించుకున్నారు. ఒక గేయ రచయితకు నోబెల్ సాహిత్య పురస్కారం లభించడం ఇదే మొదటిసారి. అమెరికా గేయ సంప్రదాయంలో నూతన భావజాలాన్ని ప్రవేశపెట్టినందుకుగాను 75 ఏళ్ల డైలాన్‌ను ఈ పురస్కారం కోసం ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. డైలాన్‌ను ఈ పురస్కారం ఎంపిక చేసినట్లు గురువారం స్వీడిష్ అకాడమీ ప్రకటించగానే కార్యక్రమానికి హాజరయిన పాత్రికేయులు హర్షధ్వానాలు చేశారు. 1941లో మినె్నసోటాలో జన్మించిన డైలాన్ అసలు పేరు రాబర్ట్ అలెన్ జిమ్మెర్‌మ్యాన్. చిన్నతనంనుంచి సంగీతం పట్ల ఆసక్తి కలిగిన ఆయన సొంతంగా హార్మోనికా, గిటార్, పియానో వాయించడం నేర్చుకుని.. గేయ రచయితగా, గాయకుడిగా ఎదిగారు. దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎన్నో సంప్రదాయ సంగీత షోలతో అభిమానులను అలరించారు. బాబ్ డైలాన్ రచించిన ‘బ్లోయింగ్ ఇన్ ది విండ్’, ‘ది టైమ్స్ దే ఆర్-ఎ చేజింగ్’ గేయాలు అమెరికా పౌరహక్కులు, యుద్ధ వ్యతిరేక ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. చిత్రకారుడు కూడా అయిన బాబ్ పెయింటింగ్స్‌ను ఆయన ఆల్బమ్స్‌కు కవర్‌గా వాడారు. ఆయన తన జీవిత కథను స్వయంగా అక్షరబద్ధం చేశారు.
డైలాన్‌కు ఈ పురస్కారంకింద నగదు బహుమతిగా 80 లక్షల క్రోనోర్లు (దాదాపు 9,06,000 డాలర్లు) లభిస్తాయి. సాహిత్యంలో నోబెల్ పరస్కారం ప్రకటనతో ఈ ఏడాది నోబెల్ పురస్కారాల ప్రకటన ముగిసింది. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ జయంతి అయిన డిసెంబర్ 10న జరిగే ప్రత్యేక కార్యక్రమంలోఈ ఏడాది నోబెల్ పురస్కారాలు ప్రకటించిన వారికి పురస్కారాలను అందజేస్తారు. అదేరోజు ఓస్లోలో జరిగే మరో ప్రత్యేక కార్యక్రమంలో నోబెల్ శాంతి పురస్కార గ్రహీతకు అవార్డును అందజేస్తారు.