అంతర్జాతీయం

ఉగ్రవాద నిరోధానికి సమగ్ర వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెనౌలిమ్ (గోవా), అక్టోబర్ 16: తమ గడ్డపైనుంచి ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థవంతంగా అడ్డుకోవాలని ప్రపంచంలోని అన్ని దేశాలకు ‘బ్రిక్స్’పిలుపునిచ్చింది. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితిలో ఒక అంతర్జాతీయ తీర్మానాన్ని ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ఆమోదించాలని కూడా కోరింది. ఉగ్రవాదం, హింసాత్మక చర్యలను పురిగొల్పడం, విప్లవ భావాలను రేకెత్తించండం, ఉగ్రవాద సంస్థల్లో చేర్చుకోవడం, ఉగ్రవాదుల కదలికలను నిరోధించడం లాంటి చర్యలతో పాటుగా ఉగ్రవాద ముఠాలకు నిధులను సమకూర్చే మార్గాలను అడ్డుకునే విషయంలో సమగ్రమైన విధానాన్ని అనుసరించాలని ఆదివారం గోవాలోని బెనౌలిమ్‌లో బ్రెజిల్, రష్యా, నారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు సభ్యులుగా ఉన్న ‘బ్రిక్స్’ కూటమి రెండు రోజుల సమావేశం ముగింపుఅనంతరం ఆమోదించిన తీర్మానం అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో సంపూర్ణమైన విధానాన్ని అనుసరించాలని కూడా ఆ డిక్లరేషన్ పిలుపునిచ్చింది. మనీ లాండరింగ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నేరపూరిత కార్యకలాపాలు లాంటి వ్యవస్థీకృత నేరాల ద్వారా ఉగ్రవాద ముఠాలకు నిధులు అందడాన్ని సమర్థవంతంగా అడ్డుకోవాలని, ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించడం, ఉగ్రవాద ముఠాలు సోషల్ మీడియా లాంటి మాధ్యమాల ద్వారా ఇంటర్నెట్‌ను దుర్వినియోగం చేయడాన్ని నిరోధించడం లాంటి వాటిపైన ప్రధానంగా దృష్టిపెట్టాలని కూడా ఆ తీర్మానం కోరింది. ఉగ్రవాద నిరోధక చర్యలన్నీ కూడా అంతర్జాతీయ చట్టాలను కాపాడాలని, మానవ హక్కులను గౌరవించాలని కూడా ఆ తీర్మానంలో కోరారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఐక్యరాజ్య సమితిది కీలక పాత్ర అని తీర్మానం స్పష్టం చేస్తూ, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలన్నిటినీ పటిష్ఠంగా అమలు చేయాలని కూడా పిలుపునిచ్చింది.
కాగా, మార్కెట్ ఆధారిత సూత్రాల ఆధారంగా ఒక క్రెడిట్ రేటింగ్ ఏజన్సీని ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధింధించిన పనిని వేగవంతం చేయాలని కూడా బ్రిక్స్ ఆ తీర్మానంలో అంగీకరించింది. అలాగే అవినీతిని ఎదుర్కొనే విషయంలోను, విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించే విషయంలోను ప్రపంచ దేశాలన్నీ గట్టిగా కృషి చేయాలని కూడా ఆ తీర్మానం పిలుపునిచ్చింది.