అంతర్జాతీయం

సింధు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 20: సింధూ జలాల ఒప్పందాన్ని ఏ విధంగా ఉల్లంఘించినప్పటికీ, తాము సరైన రీతిలో చర్య తీసుకుంటామని భారత్‌ను పాకిస్తాన్ హెచ్చరించింది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ పునస్సమీక్షించేందుకు భారత్ ప్రయత్నిస్తోందన్న వార్తలపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీస్ జకారియా స్పందిస్తూ 56 సంవత్సరాల సింధూ జలాల ఒప్పందాన్ని పునస్సమీక్షించటం అంటే జమ్ము కాశ్మీర్‌లో భారత సైన్యం అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రపంచం దృష్టి మరల్చటానికి చేసే ప్రయత్నమేనని ఆయన అన్నారు. అంతర్జాతీయ సమాజం కాశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలపట్ల ఆందోళనగా ఉందని ఆయన అన్నారు. ఈ సంవత్సరం భారత్ 90సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కూడా పేర్కొన్నారు. పాకిస్తాన్‌ను ఒంటరి చేయటం అర్థం లేనిదని, పాక్ పట్ల భారత్ వ్యతిరేక వైఖరి ప్రాంతీయ అభివృద్ధికి పెద్ద ఆటంకంగా మారిందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ కళాకారుల పట్ల భారత్ అనుసరిస్తున్న విధానం తీవ్రంగా ఖండించాల్సిన అంశమన్నారు. తన రాజకీయ ఆకాంక్షలకు సార్క్‌ను ఉపకరణంగా భారత్ వాడుకుంటోందని ఆయన విమర్శించారు. భారత్, పాక్‌ల మధ్య వివాదాల పరిష్కారం విషయంలో, ముఖ్యంగా కాశ్మీర్ పరిష్కారం విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని అమెరికన్ మిత్రులను పదే పదే కోరుతున్నామని జకారియా అన్నారు.