అంతర్జాతీయం

మూడోసారి హిల్లరీనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్‌వెగాస్, అక్టోబర్ 20: మరో మూడు వారాల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అత్యంత కీలకం, చివరిదైన మూడో ముఖాముఖిలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విజయం సాధించారు. సిఎన్‌ఎన్ నిర్వహించిన తాజా పోల్‌లో ట్రంప్ కంటే 13శాతం అధికంగా మద్దతు సంపాదించినట్లు సదరు వార్తా సంస్థ గురువారం వెల్లడించింది. మూడో ముఖాముఖిని వీక్షించిన ప్రేక్షకుల్లో 52శాతం మంది హిల్లరీ చాలా బాగా ప్రభావితం చేశారని పేర్కొన్నారు. 39శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా స్పందించారు. సిఎన్‌న్ విడుదల చేసిన సమాచారం ప్రకారం మొత్తం మూడు ముఖాముఖి చర్చల్లోనూ హిల్లరీయే విజయం సాధించారు. మొదటి ముఖాముఖి న్యూయార్క్‌లో జరిగింది. ఇందులో హిల్లరీ 35పాయింట్ల మార్జిన్‌తో ట్రంప్‌పై గెలిచారు. ఆ తరువాత సెంట్ లూరుూస్‌లో జరిగిన కార్యక్రమంలో 23పాయింట్లతో గెలిచారు. మూడో ముఖాముఖి లాస్‌వెగాస్‌లో జరిగింది. ఇందులోనూ హిల్లరీ గెలిచారని సి ఎన్ ఎన్ పేర్కొంది. అయితే ట్రంప్ ప్రచార సిఈఓ స్టీవ్ బనాన్ మాత్రం ట్రంప్ గెలుపొందారని ప్రకటించారు. ‘‘ఈ రాత్రి డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. అమెరిన్ అధ్యక్షపదవికి హిల్లరీ అనర్హురాలని అమెరికన్ ప్రజలకు విజయవంతంగా గుర్తు చేయగలిగారు.’’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ సభ్యుడు బిల్ జాన్సన్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘ ఈ రాత్రి జరిగిన తుది చర్చల్లో అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య అంతరాలను అమెరికన్ ప్రజలు చూశారు. ట్రంప్ ఒక బయటి వ్యాపార వేత్తగా వేతన రోజు నుంచి వేతన రోజు వరకు కష్టపడి పనిచేసే అమెరికన్లకు సహాయం చేస్తున్నారు.’ అని పేర్కొన్నారు. అటు హిల్లరీ శిబిరం కూడా తమదే విజయమని ప్రకటించుకుంది. ఆధునిక అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత ప్రభావితమైన ముఖాముఖిలో క్లింటన్ ట్రంప్‌ను తీవ్రంగా అణచివేశారని హిల్లరీ శిబిరం పేర్కొంది. వాషింగ్టన్ టైమ్స్ పోల్‌లో ట్రంప్ 77శాతం మంది మద్దతును సంపాదించారని, 17శాతమే హిల్లరీకి మద్దతు పలికినట్లుగా వెల్లడించిన ఫలితాలను ఆయన ట్వీట్ చేశారు.